అమిత్ షా కు కరోనా నెగటివ్ వట్టిదే - తాజాగా టెస్టు చేయలేదన్న హోం శాఖ - బీజేపీ ఎంపీపై విమర్శలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం తలెత్తింది. కరోనా మహమ్మారి బారిన పడి గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనకు తాజా టెస్టుల్లో నెగటివ్ అని తేలిందంటూ వార్తలు రావడంతో బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఊరట చెందారు. కానీ నిమిషాల వ్యవధిలోనే సదరు వార్త ఫేక్ అంటూ సాక్ష్యాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖనే క్లారిటీ ఇచ్చింది.
అమిత్ షాకు కరోనా నెగటివ్ అని నిర్ధారణ అయిందంటూ బీజేపీ ఎంపీ, ఢిల్లీ శాఖ మాజీ చీఫ్ మనోజ్ తివారీ చేసిన ట్వీట్ వల్లే మంత్రి ఆరోగ్యంపై గందరగోళం ఏర్పడింది. ''గడిచిన వారం రోజులుగా మంత్రి గారికి ఎలాంటి టెస్టులు చేయలేదు. ఆయన కరోనా నెగటివ్ గా తేలారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆస్పత్రి వర్గాలుగానీ, అధికారులుగానీ దీన్ని ధృవీకరించడంలేదు''అని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అత్యుత్సాహానికి పోయి తప్పుడు ట్వీట్ చేసిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. అమిత్ షాకు తాజాగా టెస్టులేవీ చేయలేదన్న హోం శాఖ ప్రకటన తర్వాత ఎంపీ తివారీ తన ట్వీట్ ను డిలిట్ చేశారు.
కరోనా లక్షణాలతో అమిత్ షా ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆరుగురు కేంద్ర మంత్రులు సైతం పాజిటివ్ గా తేలి వివిధ ఆస్పత్రుల్లో చేరారు. ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 21.56లక్షలకు, మరణాలు దాదాపు 44వేలకు చేరుకున్నాయి.
Recommended Video
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications