MI vs GT : గుజరాత్ తో కీలకపోరు : ఆ రెండు కీలక అస్త్రాల్ని బయటికి తీస్తున్న ముంబై...!

ఐపీఎల్ 2023 లీగ్ దశ ముగింపుకు చేరుకుంటోంది. ప్లే ఆఫ్స్ లోకి చేరారంటే ప్రతీ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్దితుల్లో ప్రతీ జట్టూ చెమటోడుస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో ముంబై ఇండియన్స్ తో ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లోకి దర్జాగా అడుగుపెట్టేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సిద్ధమవుతోంది. అదే సమయంలో గుజరాత్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సంచలనాల ముంబై ఇండియన్స్ కూడా రెడీ అవుతోంది. దీంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవాళ సొంత గడ్డ ముంబైలోని వాంఖడే స్టేడియంలో బలమైన ప్రత్యర్ధి గుజరాత్ టైటాన్స్ తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్ సిద్దమవుతోంది. ఈ పోరులో గెలిస్తే ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి.ఇప్పటికే ఆడిన 11 మ్యాచ్ ల్లో 6 గెలిచి 12 పాయింట్లతో నాలుగు స్ధానంలో ఉన్న ముంబై.. 8 మ్యాచ్ లు గెలిచి టాప్ లో ఉన్న గుజరాత్ తో పోరును ఏమాత్రం లైట్ తీసుకోవడం లేదు. అందుకే ఈ సీజన్ ఆరంభంలో ఆడించి ఆ తర్వాత డగౌట్ కు పరిమితం చేసిన ఓ కీలక పేసర్ తో పాటు మరో స్టార్ బ్యాట్స్ మెన్ ను సైతం తిరిగి రంగంలోకి దింపబోతోంది.

mivsgt

ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే కీలక పోరులో ముంబై జట్టు.. పేసర్ అర్జున్ టెండూల్కర్ ను బరిలోకి దింపబోతోంది. ముంబై జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు మంచి టచ్‌లో ఉన్నారు. కానీ బౌలింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తప్ప మరెవ్వరూ మెరుగ్గా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయారు. దీంతో తొలి నాలుగు మ్యాచ్ ల్లో 3 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్ ను మళ్లీ జట్టులోకి తీసుకురావాలని భావిస్తోంది.

అలాగే హైదరారాబాదీ స్టార్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మను సైతం జట్టులోకి తీసుకురావాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్ లో 158 స్ట్రైక్ రేట్ తో 274 రన్స్ చేశాడు. అయితే అనారోగ్యం కారణంగా గత రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ వంటి బ్యాట్స్ మెన్ అవసరం ముంబైకి చాలా ఉంది. ముఖ్యంగా ఓవైపు సూర్యకుమార్ యాదవ్ మెరుపులకు తోడు ఇటు తిలక్ వర్మ కూడా తోడైతే ఇక గుజరాత్ తో మ్యాచ్ లో తిరుగుతుండదని ముంబై భావిస్తోంది. అందుకే తిలక్ వర్మకు ఈసారి చోటిచ్చే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+