ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 166 మంది ప్రయాణికులు..
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్ కతా నుంచి శ్రీ నగర్ కు వెళ్తున్న ఇండిగో విమానం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇంధనం లీకేజీ కారణంగా ఇండిగో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానంలోని 166 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేసింది. సాధారణ కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇండిగో బోర్డు పేర్కొంది.
కోల్ కతా నుంచి శ్రీ నగర్ కు వెళ్తున్న ఇండిగో విమానం వారణాసిలోని లాల్ బహదూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇండిగో విమానం 6E-6961.. 166 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. " కోల్ కతా నుంచి శ్రీ నగర్ వెళ్తున్న ఇండిగో విమానం 6E-6961 వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంధన సమస్యల కారణంగా ఇది జరిగింది. ఘటన సమయంలో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు" అని ఎయిర్ పోర్ట్ అథారిటీ స్పష్టం చేసింది.
విమానంలో ఇంధన లీకేజీ సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే వారణాసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. ల్యాండింగ్ పర్మిషన్ కోసం సంప్రదించారు. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలిస్తోంది.
ఎయిర్ క్రాఫ్ట్ ను రీపేర్ చేస్తోంది. అత్యవసర రీపేర్లు పూర్తయ్యాక విమానం తన గమ్య స్థానాన్ని చేరుకోనుంది. ఇటీవల కూడా అక్టోబర్ 14 న ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. కోల్ కతాకు బయల్దేరిన విమానం అగర్తలా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ అయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో ల్యాండింగ్ చేశారు.

మరోవైపు ఎయిర్ ఇండియా విమానం తాజాగా మరోసారి షాక్ ఇచ్చింది. ఇటీవల మిలాన్ నుంచి దిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా చివరి నిమిషంలో వెల్లడించింది. మంగళవారం అర్ధరాత్రి 1. 15 నిమిషాలకు ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని వెనక్కు మళ్లించారు. టేకాఫ్ అయిన ఎయిర్ పోర్టులోనే ల్యాండింగ్ చేశారు.












Click it and Unblock the Notifications