మందు కొట్టిన మెడికో: రిసార్టులో గ్యాంగ్ రేప్ చేశారు

చెన్నై: స్నేహితులతో కలిసి మహాబలిపురానికి విహారయాత్రకు వెళ్లిన వైద్య విద్యార్థిని మీద ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసి మాయం అయ్యారు. యువతి మీద అత్యాచారం చేసిన నిందితుల కోసం మహాబలిపురం పోలీసులు గాలిస్తున్నారు.

కేరళలోని పాలక్కాడు జిల్లాకు చెందిన యువతి (28) ఎంబీబీఎస్ పూర్తి చేసింది. తరువాత కట్టాంగళత్తూరులోని ఎస్ఆర్ఎం కాలేజ్ లో ఎంఎస్ రేడియాలజీ చదువుతున్నది. ఈమె చెన్నైలోని బిసెంట్ నగర్ లోని ఓ లేడీస్ హాస్టల్ ఉంటూ రోజు కాలేజ్ కి వెళ్లి వస్తున్నది.

చెన్నైలోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దీపక్ అనే యువకుడిని ఆమె ప్రేమిస్తున్నది. ఇటీవల ఆమె దీపక్, చెన్నై ఐఐటీలో పీహెచ్ డీ చేస్తున్న నసికేతతో కలిసి మహాబలిపురంకు విహారయాత్రకు వెళ్లింది.

మహాబలిపురం పూర్తిగా సంచరించి ముగ్గురు మద్యం సేవించారు. తరువాత నిషా తలకు ఎక్కడంతో చెన్నైలోని ఇంటికి వెళ్లలేక మహాబలిపురంలోని ఓ ప్రయివేట్ రిసార్టు ( హోటల్)లో వేరువేరుగా గదులు తీసుకుని నిద్రపోయారు.

 Midical student molested in Tamil Nadu

మరుసటి రోజు ఉదయం రిసార్టులో పని చేస్తున్న ఇద్దరు తన మీద అత్యాచారం చేశారని ఆమె రిసార్టు యజమానికి ఫిర్యాదు చేసింది. రిసార్టు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శేఖర్ రిసార్టు చేరుకుని ఆమెను విచారించి వివరాలు సేకరించారు.

తరువాత మెడికో, ఆమె స్నేహితులు దీపక్, నసికేత, రిసార్టు ఉద్యోగి విజయరాఘవన్ ను విచారణకు పిలుచుకుని వెళ్లారు. మెడికో మీద అత్యాచారం జరిగిందా? లేదా? అని తెలుసుకోవడానికి చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికి వైద్య పరిక్షలు చేయించారు.

యువతి మీద అత్యాచారం జరిగిందని వైద్యులు దృవీకరించారు. అయితే ఎవరు అత్యాచారం చేశారు అని తెలియకపోవడంతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. యువతి బస చేసిన రిసార్టులో సీసీ కెమెరాలు ఉన్నా అవి పని చేయడం లేదని, అత్యాచారం చేసిన వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శేఖర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+