అధికార మదం: ఆ మంత్రి కొడుకు ఏంచేశాడో చూడండి
అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నారు బీజేపీ నేతల కుమారులు. సామాన్య పబ్లిక్‌పై విరుచుకుపడుతున్నారు ఈ అధికార నేతల పుత్రరత్నాలు. ఇదేమని ప్రశ్నిస్తే మాకే ఎదురు చెబుతావా అంటూ దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. జూన్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసింగ్ రావత్ కుమారుడు రాజా తన కారును అత్యంత వేగంగా నడిపి మరో కారును ఓవర్ టేక్ చేశాడు. అనంతరం ఆ కారుకు రాజా కారు అడ్డంగా నిలిపాడు. ఆ వెంటనే తన కారులోనుంచి బయటకొచ్చి మరో కారుడ్రైవర్ చెంప చెల్లు మనిపించాడు. నీరవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఆ కారును నడుపుతున్నాడు.

రాజాతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నీరవ్ పై దాడికి దిగారు. ఇది ఒక నెల క్రితమే జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. దాడి ఘటన దృశ్యాలన్నీ సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటన జరిగి ఒక నెల కావొస్తోందని ఇరు వర్గాల వారు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని బన్స్‌వారా ఎస్పీ కాలు రామ్ రావత్ తెలిపారు.
బాధితుడు ఫిర్యాదు చేయకుండా ఒత్తిడి తీసుకొచ్చారని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తెలిపారు. బాధితుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కనుక తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు రిటైర్డ్ పోలీస్ అధికారి. దాడి చేసిన వర్గం అధికార రాజకీయపార్టీ కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు జంకుతున్నారన్నారు. దాడి ఘటన వీడియో బయటకు రాగానే విపక్షాలు అధికార బీజేపీపై ధ్వజమెత్తాయి.
పోలీసులు వెంటనే రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఘటనపై స్పందిచారు రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్. దాడి ఘటనను ఆయన ఖండించారు. అధికారంలో ఉన్నవారు ఏదైన చేయొచ్చనేలా నేతలు వారి పిల్లలు ప్రవర్తిస్తున్నారని సచిన్ పైలట్ విమర్శించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు అనేలా ఈ ప్రభుత్వం నేతలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications