పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయాలు
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ బిగ్ బ్రేక్ త్రూ సాధించింది. ఈ ఘటనతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు- ఈ అమానుష ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తోన్నారు. విచారణ సందర్బంగా ఉగ్రవాద దాడి మూలాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తోన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్రవాదులు మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాశ్మీర్ అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు ఏపీకి చెందిన వాళ్లూ ఉన్నారు.

ఈ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయాలను తీసుకుంది. భారత ఆర్మీలో కౌంటర్ టెర్రరిజాన్ని మరింత బలోపేతం చేయడానికి సంబంధించిన నిర్ణయాలు అవి. ఈ విభాగాన్ని సాంకేతికంగా సుధృడంగా మార్చడానికి కేంద్రం తక్షణ చర్యలను చేపట్టింది.
ఇందులో భాగంగా- 13 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ 2,000 కోట్ల రూపాయలు. ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ విధానం కింద 1,981.90 కోట్ల రూపాయలను దీని కోసం ఖర్చు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలతో కూడి ఓ అధికారిక ప్రకనట విడుదల చేసింది. ఈ ఒప్పందాల ద్వారా..
- ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్ డిక్షన్ సిస్టమ్
- లో- లెవెల్ లైట్ వెయిట్ రాడార్స్
- వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో కూడిన లాంఛర్లు, మిస్సైళ్లు
- రిమోట్లీ పైలటెడ్ ఏరియల్ వెహికల్స్
- వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్
- వివిధ కేటగిరీలకు చెందిన డ్రోన్లు
- బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్స్
- బాలిస్టిక్ హెల్మెట్లు
- హెవీ అండ్ మీడియం క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్
- నైట్ సైట్స్ ఫర్ రైఫిల్స్..ను ఈ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ విధానం కింద రక్షణ మంత్రిత్వ శాఖ కొనుగోలు చేయనుంది.












Click it and Unblock the Notifications