అత్యాచారం: అబార్షన్‌కు అనుమతివ్వండి.. కోర్టులో కేన్సర్ బాధితురాలు విజ్ఞప్తి

క్యాన్సర్‌తో బాధపడుతూ గర్భందాల్చిన తన 13 ఏళ్ల కూతురి గర్భం తీయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ బాలిక తల్లిదండ్రులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బాలిక పెట్టుకున్న పిటిషన్‌పై నివేదిక సమర్పించాలని బాంబే హైకోర్టు ముంబైలోని జేజే హాస్పిటల్‌కు ఆదేశాలు జారీచేసింది.

వివరాల్లోకి వెళితే... గర్భం దాల్చిన బాలిక తల్లి ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. మజ్లిస్ అనే ఎన్జీఓ సంస్థ సహాయంతో తన కూతురి పరిస్థితిపై హైకోర్టును ఆశ్రయించింది. తన కూతురు క్యాన్సర్‌తో బాధపడుతోందని చికిత్స పొందుతోందని కోర్టుకు తెలిపింది. అదే సమయంలో ఆమె గర్భం దాల్చడంతో ఇప్పుడు బాలిక ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని డాక్టర్లు తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. గర్భం తీస్తే తన కూతురు బతికే అవకాశం ఉందని అందుకోసం అనుమతించాలని పిటిషన్‌లో కోరింది.

Minor rape survivor battling with cancer seeks termination of pregnancy

2010 నుంచి బాలిక బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోందని ఇక అప్పటి నుంచే తాను నగరంలోని వాడియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోందని లాయర్ కుల్దీప్ నికం తెలిపారు. సెప్టెంబర్ 5న చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లగా ఆమె గర్భవతి అన్న విషయం వెలుగు చూసిందని వెల్లడించారు. బాలిక చదివే స్కూల్లో ఆమె మిత్రడే తనను అత్యాచారం చేశాడని తల్లితో చెప్పింది. అత్యాచారం చేసిన కుర్రాడు మైనర్ బాలుడు. అతనిపై బోయివాడా పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

బాలిక 6నెలల గర్భవతి అని వాడియా హాస్పిటల్ ఇచ్చిన సోనోగ్రఫీ నివేదికను కోర్టుకు లాయర్ సమర్పించారు. ఇప్పుడు గర్భం తీయకుంటే బాలిక ప్రాణాలకు ప్రమాదమని వెల్లడించారు. ఒకరు చేసిన పాపానికి బాలిక నరకం అనుభవిస్తోందని.. ఒకవైపు క్యాన్సర్ మరోవైపు గర్భంతో బాలిక ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని లాయరు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఒక కమిటీ వేసి బాధితురాలిని పరీక్షించి శుక్రవారాని కల్లా నివేదిక ఇవ్వాలని జేజే హాస్పిటల్‌ డీన్‌ను ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+