మైనర్ల ఘాతుకం: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, ఆన్‌లైన్‌లో వీడియో పెట్టారు!
ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా శరణకుల్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా శరణకుల్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని బెదరింపులకు పాల్పడ్డారు.
ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఆ దుర్మార్గులు అత్యాచారం చేసిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో ఉంచడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు శరణకుల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే, ఘటన అనంతరం విషయం బయటపడితే పరువుపోతుందని కుటుంబసభ్యులు భయపడి ఫిర్యాదు చేయలేదు. కానీ, ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో రావడంతో గ్రామస్థులు నిందితుల్లో ఓ యువకుడిని పట్టుకుని గ్రామసభ నిర్వహించారు.
బాధితురాలిని వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అందుకు యువకుడు నిరాకరించడంతో ఆదివారం రాత్రి బాలిక కుటుంబసభ్యులు, గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications