బందరు టెక్కీ మృతి: రేప్ చేసి, హత్య చేశారా?

బందరుకు చెందిన 23 ఏళ్ల అనూహ్య సగం కాలిన మృతదేహం గురువారంనాడు ముంబై శివారులోని కంజూర్‌మార్గ్‌లోని తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేపై కనిపించిన విషయం తెలిసిందే. టిసిఎస్‌లో అనూహ్య పనిచేస్తోంది.
సెలవుల కోసం మచిలీపట్నం వచ్చిన ఆమె తిరిగి ముంబై బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. గురువారం ముంబైలోని కంజుమార్గ్‌లో ఆమె మృతదేహం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం అనూహ్యదని తండ్రి ప్రసాద్ గుర్తించినట్లుగా తెలుస్తోంది.
ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి కుటుంబ సభ్యులు గుర్తించారు. సెలవుల కోసం వచ్చిన ఆమె ముంబై వెళ్లేందుకు విశాఖపట్నం - ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ నెల 4న విజయవాడలో ఎక్కారు. ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు రైలు షోలాపూర్‌లో ఉంది. అంధేరీలోని తన హాస్టల్‌కు చేరాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఫోన్ రాలేదు.












Click it and Unblock the Notifications