సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన కేంద్రమంత్రి పియూష్ గోయల్...!
ఆటో మోబైల్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో కేంద్రమంత్రులు సంక్షోభానికి గల కారణాలను ప్రజలకు వివరించేందుకు తడబడుతున్నారు. ఈనేపథ్యంలోనే ఏదో చెబుతామనుకుంటే మరెదో అవుతోంది. ఈనేపథ్యంలోనే ఇద్దరు మంత్రులు అబాసుపాలైన విషయం తెలిసిందే. దీంతో వారు చేసిన తప్పులను ప్రజల ముందుకు ఒప్పకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడీయా సెటైర్లకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దిగివచ్చాడు. తాను చేసిన తప్పును అంగీకరించారు. గురుత్వాకర్షణ శక్తి సిద్దాంతంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పకున్నారు. అయితే ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారని చెప్పిన ఆయన,తప్పులు చేసినంత మాత్రన నేను భయపడేవాడిని కాదంటూ ప్రకటించారు.

గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనుక్కోంది ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యలు
గురువారం ఆయన ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో దుమారాన్ని రేపాయి. ఈనేపథ్యంలోనే దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. విపక్షాలకు కౌంటర్ ఇచ్చే సమయంలో ఆయన అబాసుపాలయ్యారు.కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సితారామన్‌కు మద్దతుగా నిలిచే సమయంలో ఆయన కూడ ప్రజల్లో ఆభాసు పాలయ్యాడు. ఈనేపథ్యంలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇంట్లో కూర్చొని లెక్కలు వేయకండి అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సంధర్భంలోనే ముందు గణితాన్ని మర్చిపోండి.. గణితాన్ని పట్టుకొని ఉంటే ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కునే వాడు కాదు. కేవలం గణితమే ముఖ్యమైతే ఏ ఆవిష్కరణలు ప్రపంచంలో జరిగి ఉండేవి కాదు. అంటూ వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు...
అయితే నిజానికి గురత్వాకర్షణ శక్తిని కనిపెట్టింది ‘న్యూటన్'. కానీ కేంద్ర మంత్రి మాత్రం ఐన్‌స్టీన్ అంటూ వ్యాఖ్యానించి నెటిజన్లకు దొరికిపోయాడు. దీనిపై చాలా మంది సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తోంది. ఆయన మాటలకు నెటిన్లు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో నేడు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చాడు.గురుత్వాకర్షణ శక్తి సిద్దాంతంపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పకున్నారు. అయితే ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారని చెప్పిన ఆయన,తప్పులు చేసినంత మాత్రన నేను భయపడేవాడిని కాదంటూ ప్రకటించారు.

క్యాబ్‌ల వల్లే కార్ల కొనుగోలు తగ్గిందన్న నిర్మలా సితారామన్
దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ్లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్లే కారణమని .. యువత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కారు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొవడం కన్నా .. క్యాబ్ బుక్ చేసుకోవడమే మేలని యువత భావిస్తున్నారని ఆమే తెలిపారు. అయితే కేంద్రమంత్రి చేసిన కామెంట్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక సోషల్ మీడీయాలో అయితే నెటిజన్లు వింత వింత కామెట్లు పెట్టారు.మరోవైపు ఆమే చేసిన వ్యాఖ్యలను మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం తప్పుబట్టారు. కార్ల విక్రయాలు పడిపోవడాన్ని ఆమే తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications