Mizoram results 2023: మిజోరంలో విపక్ష జడ్పీఎం హవా-మణిపూర్ దెబ్బకు ఎంఎన్ఎఫ్ వెనుకంజ !
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష జడ్పీఎం హవా కొనసాగుతోంది. మొత్తం 40 సీట్లున్న మిజోరం అసెంబ్లీలో ఇప్పటికే 26 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. దీంతో అధికార ఎంఎన్ఎఫ్ ను ఓటర్లు ఆదరించలేదని ఆర్ధమవుతోంది. పొరుగున ఉన్న మణిపూర్ లో అల్లర్ల ప్రభావం, బీజేపీతో స్నేహం, ప్రజా వ్యతిరేకత అధికార ఎంఎన్ఎఫ్ కొంప ముంచినట్లు అర్ధమవుతోంది.
మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), లాల్దుహోమా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ జడ్పీఎం మధ్య గట్టి పోటీ సాగినట్లు కనిపించింది. అయితే ఈ చిన్న ఈశాన్య రాష్ట్రంలో ఓట్లు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత విపక్షానికే మొగ్గు కనిపిస్తోంది. ZPM ఇప్పటికే 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తాజా వార్తలు అందుతున్నాయి. అధికార MNF మాత్రం కేవలం 7 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంతో ఉన్నాయి.

క్రైస్తవుల జనాభా అధికంగా ఉన్న మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, విపక్ష జడ్పీఎం కూడా వారిపైనే దృష్టిపెట్టాయి. అయితే గతంలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎంఎన్ఎఫ్ పై మణిపూర్ అల్లర్ల ప్రభావం పడింది. దీంతో ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో భారీగా సీట్లు కోల్పోయింది. అదే సమయంలో విపక్షంలో ఉన్న జడ్పీఎం మణిపూర్ ఘటనల్ని సొమ్ము చేసుకుంది. మణిపూర్ అల్లర్లకు వ్యతిరేకంగా ఆ పార్టీ కుకీల మద్దతు సంపాదించడంతో మిజోరం ఎన్నికల్లో అధికారం దిశగా దూసుకుపోతోంది. కాంగ్రెస్, బీజేపీల సీట్లతో సంబంధం లేకుండానే జడ్పీఎం అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications