25 భాషలను మింగేసిన "హిందీ" భాష: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కార్ మధ్య చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తమిళనాడుకు చెందిన సెలబ్రిటిలు, రాజకీయనాయకులు మండిపడుతున్నారు. ఈక్రమంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. ఈమేరకు సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

MK Stalin Stirs Debate with Comments on Hindi Language and Its Impact on North India s 25 Languages

" ఇతర రాష్ట్రాల్లో ఉన్న నా ప్రియమైన సోదర, సోదరీమణులారా.. హిందీ భాష కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా..? 100 ఏళ్లలో నార్త్ ఇండియాలో 25 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లు హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు" అని స్టాలిన్‌ పోస్టు చేశారు.

నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ(NEP)లో భాగమైన త్రిభాషా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయంపై ఇటీవల ప్రముఖ నటులు కమల్ హాసన్, దళపతి విజయ్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+