సీఎం సిద్దూ గ్రేట్, బీజేపీ అంటే ఏమిటో ?, లోక్ సభ ఎన్నికలు, గాలి జనార్దన్ రెడ్డి !

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి తెరమీదకు వచ్చారు. సిద్దరామయ్య, డీకే. శివకుమార్ ప్రమాణస్వీకారం రోజు వేదిక మీద ప్రత్యక్షం అయిన గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. తరువాత సొంత నియోజక వర్గంలో గాలి జనార్దన్ రెడ్డి మకాం వేశారు.

కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి కేఆర్ పీపీ నుంచి (గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ) పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి తరువాత కమల పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారు.

MLA Gali Janardhan Reddy praised Siddaramaiah as a great CM

గురువారం గంగావతిలో గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య చాలా చక్కగా పని చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను ఇటీవల సీఎం సిద్దరామయ్యతో చర్చించానని, ఆయన తాను చెప్పిన మాటలను ఎంతో ఓపిగా విన్నారని కేఆర్ పీపీ ఎమ్మెల్యే, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

గంగావతి అభివృద్ధి కోసం సీఎం సిద్ధరామయ్యను కలిశాను. ఈ చర్చల సందర్బంగా ఆయన సానుకూలంగా స్పందించారని, గంగావతి నియోజకవర్గం అభివృద్ధికి, అంజనాద్రి అభివృద్ధికి గ్రాంట్ ఇచ్చి సహకరిస్తానని సీఎం సిద్ధరామయ్య తనకు హామీ ఇచ్చారు. మరో రెండు నెలల్లో అంజనాద్రి అభివృద్ధికి శ్రీకారం చుడతామని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

MLA Gali Janardhan Reddy praised Siddaramaiah as a great CM

సిద్ధరామయ్య 14 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు, ఆయనకు ఆర్థిక శాఖ మీద మంచి పట్టు, అనుభవం ఉంది, ఉచిత గ్యారంటీ పథకాలకు సంబంధించిన నిధులు ఏకీకృతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఉచిత హామీ పథకాలతో పాటు అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తామన్నారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి 7 నుంచి 8 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాను సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో పూర్తి సమాచారం ఇస్తామని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

మళ్లీ తాను బీజేపీలోకి వెళ్లనని, ఎన్డీయే కూటమిలో చేరే ప్రసక్తే లేదని, సొంత కేఆర్ పీపీ నుంచే తాను రాజకీయంగా అభివృద్ధి చెందుతానని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలకు కేఎంఎఫ్ నుంచి నెయ్యి సరఫరా చెయ్యాలని, కేఎంఎఫ్ కు ఆ పని చేసే శక్తి ఉందని, అయితే ఇక్కడికి సరఫరా ఆపకుండా ఉండాల్సిందని కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద తాను బీజేపీలో చేరే ప్రసక్తేలేదని మరోసారి గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+