ఎమ్మెల్యే బంధువు, రూలింగ్ పార్టీ మాస్ లీడర్, బస్ స్టాండ్ పక్కనే వేటకొడవళ్లు నరికి, తుపాకులతో కాల్చి !
బెంగళూరు/ కలబురిగి: కర్ణాటకలోని (Karnataka) కలబురిగి జిల్లాలోని బి. మాదర గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రస్తుత అఫజల్‌పూర్ కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే ఎంవై పాటిల్ సన్నిహితుడు గౌడప్పగౌడ్ పాటిల్‌ను దారుణంగా నరికి చంపేశారు. చవడాపుర క్రాస్ బస్ స్టాండ్ ((bus stand)) పక్కనే రోడ్డుపై కొడవళ్లతో గౌడప్ప గౌడను నరికి చంపేయడం (murder) కలకలం రేపింది.
కలబురిగి జిల్లాలోని అఫ్జల్‌పురా తాలూకాలోని స్టేషన్ కు సమీపంలోని చావడాపుర బస్టాండ్ (bus stand) దగ్గర నిలబడి అందరితో మాట్లాడుతుండగా రెండు బొలెరో వాహనాల్లో దిగిన హంతకులు ఆయుధాలు చూపి గౌడప్ప గౌడ్‌పై నీ కథ అయిపోయిందిరా అంటూ అతని మీద దాడి చేశారు. తల్వార్ లతో గౌడప్ప గౌడ మెడపై నరికి, తుపాకుల కాల్చి చంపేసి (murder) దర్జాగా అక్కడి నుంచి పరారయ్యారు.

రక్తపు మడుగులో పడి ఉన్న గొడ్డప్ప గౌడను హత్య చేసిన దుండగులు మృతదేహం చుట్టూ నృత్యాలు చేస్తూ కేకలు వేశారు. కళ్ల ముందే జరిగిన దారుణ హత్యతో (murder) అక్కడున్న వందలాది మంది ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు కన్నడ మీడియాకు చెప్పారు. చావదాపూర్ క్రాస్ చాలా రద్దీగా ఉండే ప్రదేశం. బస్టాండ్ (bus stand) ఇక్కడే ఉండడంతో హంతకులు గౌడప్ప గౌడ్ అక్కడే చంపాలని (murder) డిసైడ్ అయ్యారు.
గౌడప్ప గౌడను టార్గెట్ చేసుకున్న ప్రత్యర్థులు అతన్ని చంపేయాలని అనుకున్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాప్ (bus stand) దగ్గర తనను చంపేస్తారని (murder) గౌడప్ప గౌడ కూడా అసలు ఊహించలేకపోయాడు. మెరుపుదాడి చేసిన ప్రత్యర్థులు తల్వార్‌లతో నరకడంతో గౌడప్ప గౌడ కుప్పకూలిపోయాడు. వెంటనే అతని మీద తుపాకులతో కాల్పులు జరిపారు.
ఆదెబ్బతో చావడాపురలో కలకలం రేగింది.గౌడప్ప గౌడ పాటిల్ గ్రామ పంచాయితీ అధ్యక్షుడు.ఇటీవల జరిగిన మాదర (బి) గ్రామ పంచాయతీకి రెండోసారి జరిగిన ఎన్నికల్లో గౌడప్ప పాటిల్ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. దీనికి తోడు అఫజల్ పూర్ ప్రస్తుత కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే ఎం.వై. పాటిల్ కు గౌడప్ప గౌడ చాలా దగ్గర బంధువు కూడా కావడంతో అందరూ హడలిపోయారు.

గౌడప్ప గౌడ పాటిల్ మృతదేహాన్ని (murder) పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కలబురగికి తరలించారు. కలబురగి ఎస్పీ (SP) అడ్డూరు శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. హత్య ఘటనపై గంగాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే (MLA)ఎంవై పాటిల్ డిమాండ్ చేశారు.తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నడిబొడ్డున చవడాపూర్ బస్టాండ్ వద్ద తన సన్నిహితుడు గోడప్ప గౌడ్ దారుణ హత్యకు గురైన సంఘటనను ఎమ్మెల్యే ఎం.వై. పాటిల్ తీవ్రంగా ఖండించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.
గౌడప్ప గౌడ హత్య (murder) జరిగిన తరువాత అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మా పార్టీ నాయకులను పట్టపగలు ఇలా మెరుపుదాడి చేసి చంపేశారు. పరిశ్రమ, వ్యాపార వైరం, రాజకీయాలు, పాత కలహాలు అన్నీ ఈ హత్యా (murder)పథకం వెనుక దాగి ఉన్నాయని, పోలీసులు వెంటనే హంతకులను కనిపెట్టాలని, హంతకులు ఎవరో చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చూశారని, హంతకులను పోలీసులు వెతకాలని ఎమ్మెల్యే ఎంవై పాటిల్ డిమాండ్ చేశారు.
పార్టీ నాయకుడు (leader) హత్య గురించి మా ముఖ్యమంత్రి (CM) సిద్ధరామయ్యతో మాట్లాడి కేసుపై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తానని ఎమ్మెల్యే ఎంవై పాటిల్ తెలిపారు. అఫజల్‌పూర్ తాలూకాలోని చావదాపూర్ క్రాస్ యొక్క ప్రాముఖ్యత ఈ తాలూకాలోని ముఖ్యమైన రాజకీయ సంఘటనలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంతకు ముందు ఇదే క్రాస్ లో విఠల హేరూర్‌పై హత్యాయత్నం జరిగింది.
అంతేకాదు ఈ ఘటన రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. దీని తర్వాత మాజీ మంత్రి (Minister) యాజమాన్య గుత్తేదార్ రాజకీయ జీవితానికి సంబంధించిన పలు పరిణామాలకు చావడాపూర్ క్రాస్ వేదికైంది. ఇప్పుడు గౌడప్ప గౌడ్ హత్యతో చవడాపూర్ క్రాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
అఫజల్‌పూర్ తాలూకాలోని చావదాపూర్ క్రాస్ యొక్క ప్రాముఖ్యత ఈ తాలూకాలోని ముఖ్యమైన రాజకీయ సంఘటనలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంతకు ముందు ఇదే క్రాస్ ది. విఠల హేరూర్‌పై హత్యాయత్నం జరిగింది. అంతేకాదు ఈ ఘటన రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. దీని తర్వాత మాజీ మంత్రి యాజమాన్య గుత్తేదార్ రాజకీయ జీవితానికి సంబంధించిన పలు పరిణామాలకు చావడాపూర్ క్రాస్ వేదికైంది. ఇప్పుడు గౌడప్పగౌడ్ హత్యతో (murder) చవడాపూర్ క్రాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications