వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు, ఉరితీసినా ఇదే చెప్తా: ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం కాదని అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, తనను జైలుకు పంపినా, నన్ను ఉరితీసినా తాను ఇదే మాట చెబుతానని అసెంబ్లీలో ఎమ్మెల్యే షేక్ రషీద్ సోమవారం నాడు అన్నాడు.

తనను ఏం చేసినా ఈ విషయంలో తన వైఖరి మారదని స్పష్టం చేశాడు. జమ్ము కాశ్మీర్ ఇటు భారత్, అటు పాకిస్తాన్‌లోను అంతర్భాగం కాదని చెప్పాడు.

చారిత్రాక వాస్తవాన్ని అందరూ అంగీకరించాలని, రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లేశారని భారత్ చెబుతోందని, అలాంటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కాశ్మీర్ ప్రజలు అనుకూలంగా ఓటు వేస్తేనే జమ్ము కాశ్మీర్ కచ్చితంగా భారత్‌లో అంతర్భాగమవుతుందన్నాడు.

MLA Sheikh Rasheed says Jammu and Kashmir not integral part of India

తాను ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనను ఎన్నికల్లో పాల్గొనకుండా చేసినా తాను ఇదే చెబుతానని అన్నాడు. భారత సార్వభౌమత్వానికి తాను వ్యతిరేకం కాదని, కానీ భారత్ - పాక్ మధ్య వివాదానికి కారణమైన జమ్ము కాశ్మీర్ గురించి తాను మాట్లాడుతున్నానని చెప్పాడు.

ఐక్య రాజ్య సమితి తీర్మానాలను మరుగుపరిచే అధికారం అసెంబ్లీకి లేదని చెప్పాడు. ప్రజాభిప్రాయ సేకరణలో (ప్లెబిసైట్) కాశ్మీర్ ప్రజల్లో ఎక్కువ మంది భారత్‌కు అనుకూలంగా ఓటు వేస్తే తాను కచ్చితంగా ఇది భారత్ అంతర్భాగమని అంగీకరిస్తానని చెప్పాడు.

English summary
Independent MLA Sheikh Rasheed, known for creating controversies, today spoke the separatist language in the Assembly, claiming that Jammu and Kashmir is not India's "integral part" and demanding "plebiscite".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X