మళ్లీ మిస్డ్ కాల్స్ కాలం: ఈ అర్ధరాత్రి నుంచే.. !
ముంబై: భూమి గుండ్రంగా ఉందనడానికి కోకొల్లలుగా ఉదాహరణలను చెబుతుంటారు పెద్దలు. ఇదీ అలాంటి వ్యవహారమే. దేశంలో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో కాల్ ఛార్జీలు, వాటి రేట్లు ఎంత కాస్ట్లీగా ఉండేవో బహుశా ఎవరూ మరిచిపోయి ఉండరు. అందుకే- ఒకటి లేదా రెండు రింగులు ఇచ్చేసి కట్ చేసిన వాళ్లు మనలో చాలామందే ఉంటారు. కాల్ టారిఫ్ రేట్లకు భయపడి మిస్డ్ కాల్స్ తో సరి పెట్టుకోని వారు ఉండకపోవచ్చు.

డంగైపోయేలా కాల్ టారిఫ్..
అదే పరిస్థితి మళ్లీ పుట్టుకొచ్చింది.. భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోయే మొబైల్ టారిఫ్ రేట్ల లిస్ట్ చూస్తే.. గుండె జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పట్లాగా ఏకధాటిగా మొబైల్ ఫోన్లలో కబుర్లు చెప్పుకొంటూ, వీడియోలను తిలకించడం ఇక పెను భారంగా మారింది. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో.. ఆయా సంస్థలన్నీ తమ కాల్ టారిఫ్ ను భారీగా పెంచేశాయి. ఎంత భారీగానంటే 50 శాతం మేరకు పెంచాయి. పెంచిన టారిఫ్ ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.

అయిదేళ్ల తరువాత మొదటి సారిగా..
దేశంలో టాప్ మొబైల్ ప్లేయర్లు తమ కాల్ టారిఫ్ రేట్లను భారీగా పెంచడం అయిదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ సంస్థలు తమ కాల్ రేట్లను ఈ అర్ధరాత్రి నుంచి 50 శాతం మేర పెంచుబోతుండగా.. రిలయన్స్ జియో మాత్రం ఆరో తేదీ నుంచి 40 శాతం మేర పెంచబోతోన్నట్లు ఇదివరకే వెల్లడించింది. వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్ టెల్ కొత్త టారిఫ్ రేట్లు దాదాపు ఒకేలా ఉండొచ్చని తెలుస్తోంది.

ఏడాది ప్లాన్ ప్రకారం..
వొడాఫోన్ ఐడియా ఏడాది వేలిడిటి ఉన్న ప్లాన్ ప్రకారం.. 1,499 రూపాయలను వసూలు చేయనున్నారు. అదే సమయంలో డేటా వినియోగం 12 జీపీలకు కుదించారు. ఇప్పటిదాకా ఈ ప్లాన్ 999 రూపాయల వరకే ఉండేది. అలాగే- డేటా 24 జీబీ వరకు వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఈ ప్లాన్ కాస్తా పెను భారంగా మారింది. భారతి ఎయిర్ టెల్ ఏడాది వేలిడిటి ఉన్న ప్లాన్ దాదాపుగా ఇలాగే ఉండొచ్చని చెబుతున్నారు.

వేల కోట్ల రూపాయల్లో నష్టం..
వొడాఫోన్ ఐడియా సంస్థ కిందటి నెలలో 50, 921 కోట్ల రూపాయలను నష్టపోయిందనే వాదన టెలికం రంగంలో వినిపిస్తోంది. అటు వొడాఫోన్ గానీ, ఇటు ఐడియా గానీ స్వతంత్ర సంస్థలుగా కొనసాగినప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున నష్టపోలేదని అంటున్నారు. భారతి ఎయిర్ టెల్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఆ సంస్థ 23,054 కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కాల్ టారిఫ్ రేట్లను పెంచినట్లుగా చెబుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications