మోడీ కేబినెట్ ప్రక్షాళన ఖరారు..! 20 మంది అవుట్ లేదా శాఖ మార్పు? వీరికే ముప్పు..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్ ప్రక్షాళన (modi cabinet reshuffle) చేసేందుకు సిద్దమైన ప్రధాని మోడీ.. వివిధ కారణాలతో దాన్ని కాస్తా వాయిదా వేసుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జాతీయ స్ధాయిలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. అదే సమయంలో వీటి ప్రభావం త్వరలో జరిగే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు చేసిన మోడీ.. ఇప్పుడు తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
దేశంలో మారిన పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్ని మార్చుకోవడంతో పాటు తిరిగి జనంలో విశ్వాసం పెంచుకోవడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ముఖ్యంగా రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా కేబినెట్లో మార్పులు చేసుకోవాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి కేబినెట్ మార్పులు కచ్చితంగా జాతీయ స్ధాయిలో కీలక సంకేతాలు ఇచ్చే విధంగా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం చేసుకున్న ప్రధాని మోడీ.. అందులో భాగంగానే ఇద్దరు మంత్రులకు రాజ్యసభ కొనసాగింపు ఇవ్వలేదు, అలాగే మరో ముగ్గురిని ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ లుగా పంపారు.

ఇప్పుడు కేబినెట్లో మిగిలిన మంత్రుల్లోనూ పలువురికి ఉద్వాసన పలికేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొందరు శాఖల మార్పు తప్పనిసరి అవుతోంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్. ఆమెను వేరే శాఖకు పంపి, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ను ఆర్దికమంత్రిగా నియమించే అవకాశముంది. అలాగే రెగ్యులర్ విద్యాశాఖ మంత్రిని కూడా నియమించే అవకాశం ఉంది. అలాగే పలు కీలక శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఇలా చూస్తే మొత్తం మీద 20 మంది మంత్రుల వరకూ వేటు లేదా శాఖల మార్పు ముప్పు ఎదుర్కుంటున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో భాగంగా పలువురు జూనియర్ మంత్రులపై వేటు పడొచ్చని చెప్తున్నారు. లేదా వేరే శాఖలకూ పంపే అవకాశం ఉంది. అలాగే ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, పంజాబ్ నుంచి కొత్త మంత్రులు కేబినెట్లోకి రాబోతున్నారు.















Click it and Unblock the Notifications