అమిత్ షాను ప్రధానిని చేయండి- కాంగ్రెస్ డిప్యూటీ సీఎం సలహా
రాయ్‌పూర్: మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
మణిపూర్ ఉదంతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. ఈ అంశంపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. కేంద్రం అంగీకరించట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో విస్పష్ట ప్రకటన చేయాలనేది ప్రతిపక్ష పార్టీల ప్రధాన డిమాండ్.

దీనిపై ప్రధాని మోదీ ఏ మాత్రం స్పందించట్లేదు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగులోకి వచ్చినప్పుడు తొలిసారిగా మణిపూర్ అంశంపై ఆయన బహిరంగంగా మాట్లాడారు. ఆ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామనీ హెచ్చరించారు.
ఆ తరువాత మణిపూర్ అల్లర్లు, హింసాకాండపై మోదీ ఎక్కడే గానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆయనకు బదులుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. చొరవ తీసుకుంటోన్నారు. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగనివ్వాలని, మణిపూర్ అంశంపై చర్చించడానికి తాము సంసిద్ధంగా ఉన్నామంటూ అమిత్ షా.. ప్రతిపక్ష పార్టీల నాయకులకు లేఖలు రాశారు.

దీనిపై ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ స్పందించారు. మణిపూర్ హింసాకాండపై చర్చించడానికి ప్రధాని మోదీ ఎందుకు ముందుకు రావట్లేదని ప్రశ్నించారు. అక్కడ చెలరేగుతున్న అల్లర్లకు బాధ్యత వహించడానికి ఓ దేశ ప్రధానిగా ఆయన ఏ మాత్రం అంగీకరించట్లేదని ఆరోపించారు.
అల్లర్లు చెలరేగిన 77 రోజుల తరువాత కూడా మణిపూర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనట్లేదని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీఎస్ సింగ్ దేవ్ ధ్వజమెత్తారు. ఇన్ని రోజులుగా మోదీ తన మౌనాన్ని వీడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అవిశ్వాస తీర్మానానికి మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహించడానికి మోదీ ముందుకు రానప్పుడు ప్రధాని పదవిలో ఉండి లాభం లేదని టీఎస్ సింగ్ దేవ్ విమర్శించారు. తనకు బదులుగా అమిత్ షాను ప్రధానమంత్రిగా చేయాలంటూ ఆయన మోదీకి సూచించారు. మణిపూర్ అంశంపై ప్రధాని హోదాలో అమిత్ షానే ఈ దేశానికి సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications