మోదీసర్కారు బంపర్ ఆఫర్: నిముషం రీల్స్ పంపి రివార్డ్స్ గెలుచుకోండి.. ఆగస్ట్ 1వరకు మాత్రమే!

దేశంలోని ఔత్సాహికులకు మోదీ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశంలో డిజిటల్ ఇండియా ప్రారంభించి 10సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తోంది. ఏ డికేడ్ ఆఫ్ డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ ను ప్రారంభించిన మోడీ సర్కార్ ఈ పోటీ ద్వారా డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చిందో రీల్స్ ద్వారా తెలియజేయవచ్చునని, గెలుపొందిన వారికి నగదుబహుమతులు కూడా అందజేస్తామని పేర్కొంది.

జూలై 1న ప్రారంభమై ఆగస్టు 1 వరకు డిజిటల్ ఇండియా కాంటెస్ట్
ఈ పోటీ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. ఈలోపు ఎవరైనా సరే ఈ కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ సేవలను ఆన్లైన్లోకి తీసుకురావడం, డిజిటల్ విద్యను అందించడం, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం.

Modi govt bumper offer Send minute reels on digital india and win cash rewards only until August 1st

Take a Poll

డిజిటల్ ఇండియా పై వీడియో
ఈ పదేళ్లలో డిజిటల్ ఇండియా దేశంలో ప్రజల జీవితాలను ఎలా మార్చిందో మీ అనుభవాలను రీల్స్ రూపంలో పంచుకోవడం ద్వారా సెలెబ్రేట్ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనేవారు ఒక నిమిషం నిడివి గల వీడియోను రూపొందించి పంపించాలి. ఆ వీడియోలో డిజిటల్ ఇండియా మీ జీవితంపై చూపిన ప్రభావాన్ని చాలా సృజనాత్మకంగా తెలియజేయాలి. వీడియో నిడివి కనీసం ఒక నిమిషం ఉండాలి.

పోటీలో గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులు
వీడియో కచ్చితంగా మీ సొంతంగా రూపొందించినదై ఉండాలి. ఇదివరకు ఏ సోషల్ మీడియాలోనూ అప్‌లోడ్ చేసి ఉండకూడదు. హిందీ, ఇంగ్లీష్ లేదా ఇతర స్థానిక భాషల్లో వీడియోను రూపొందించవచ్చు. వీడియో పోర్ట్రెయిట్ మోడ్‌లో MP4 ఫార్మాట్‌లో ఉండాలని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన వారికి కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతులు కూడా అందజేస్తుంది.

నగదు బహుమతులు ఇలా
మొదటి 10 మంది విజేతలకు రూ. 15,000, ఆ తర్వాతి 25 మందికి రూ. 10,000, ఆ తర్వాత 50 మందికి రూ. 5,000 చొప్పున బహుమతులు ఇస్తుంది. ఈ పోటీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ mygov.in లో చూడవచ్చు. ఇది డిజిటల్ ఇండియా సాధించిన విజయాలను ప్రజలతో పంచుకునే అవకాశం కనుక, మీలోని సృజనాత్మకతను వెలికి తీసి, ఈ పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+