చుట్టూ మిత్రుల్లేకుండా చేశారు- కాంగ్రెస్ శ్రమ వృథా చేశారు- మోడీపై రాహుల్ విసుర్లు
చైనాతో ప్రతిష్టంభన తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు భారత్‌ను కాదని డ్రాగన్ పంచన చేరుతున్నాయి. సహజంగానే పేద దేశాలైన వీటికి భారీ ప్రాజెక్టులు, నిధులు ఆశచూపి భారత్‌కు దూరం చేసేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. డ్రాగన్ కుట్రలకు అడ్డుకట్టే వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశారు.
పొరుగుదేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలను నాశనం చేస్తోందంటూ మోడీ సర్కారుపై చేసిన ఓ ట్వీట్‌లో రాహుల్ గాంధీ విమర్శించారు. పొరుగుదేశాలతో స్నేహం లేకుండా ఉండటం ప్రమాదకరం అంటూ రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. ద ఎకనమిస్ట్ పత్రికలో వచ్చిన ఓ వ్యాసాన్ని రాహుల్ కోట్ చేశారు. ఇందులో బంగ్లాదేశ్ భారత్‌ను కాదని చైనాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు. దీంతో తాజాగా బంగ్లాదేశ్ భారత్‌కు దూరమైందన్న విషయాన్ని రాహుల్ మోడీ సర్కారుకు గుర్తు చేశారు.

రాహుల్ తన ట్వీట్‌లో పొరుగుదేశాలతో భారత్ సంబంధాలు పెంపొందించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా శ్రమించిందని, ఇప్పుడు మోడీ సర్కారు వాటిని నాశనం చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో భారత్ తటస్ధ వైఖరి అవబంబించడం ద్వారా అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేది. కానీ మోడీ హయాంలో పాకిస్తాన్‌తో మొదలుపెట్టి చైనాతో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఉపఖండంలో మిగతా దేశాలు కూడా ఇప్పుడు డ్రాగన్‌కు మద్దతు ఇస్తున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications