మోడీ రాకతో కాషాయమయమైన వారణాసి...ఎటు చూసినా నమో నినాదాలే..!
ఏప్రిల్ 26న నామినేషన్ వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి వారణాసిలోని బబతాపూర్ విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బెనారస్ హిందూ యూనివర్శిటీకి చేరుకున్నారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ వ్యవస్థాపకులు మదర్ మోహన్ మాలవియా విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇక వారణాసిలో మోడీకి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఉత్సాహంతో ఎదురుచూశారు. అక్కడి నుంచి కారులో ప్రధాని మోడీ లంకకు బయలుదేరి వెళ్లారు.
లంకనుంచి ఆయన రోడ్ షో ప్రారంభం అవుతుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల మేరా ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. మోడీ రాకతో వారణాసిలోని వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. ఎటు చూసిన మోడీ నినాదాలతో వీధులు మారిమ్రోగిపోతున్నాయి. మోడీ రోడ్ షోలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోడ్ షో దాదాపు నాలుగు గంటల పాటు సాగనుంది.

మోడీ రాకతో వారణాసిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యూపీ పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఇక రోడ్ షో అనంతరం మోడీ పవిత్ర గంగానదికి హారతి పడతారు. అనంతరం ఈ రాత్రికి వారణాసిలోని ఓ హోటల్‌లో బసచేసి శుక్రవారం ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేస్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications