ట్రంప్ కు దిమ్మతిరిగేలా మోదీ మార్క్ షాక్!

పాకిస్తాన్తో యుద్ధంలోనే కాదు, అమెరికాతో వాణిజ్య సమరంలోనూ వెనక్కి తగ్గేది లేదని మరో మారు తేల్చి చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ ఇచ్చారు. భారత్ నుండి ఎగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల పైన అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందిస్తూ ప్రతీకార సుంకాలు విధించేందుకు భారత్ సిద్ధమైంది.

యూఎస్ విధించిన అధిక సుంకాలకు భారత్ ప్రతిస్పందన
అమెరికా నుండి దిగుమతి అయ్యే కొన్ని ప్రత్యేక వస్తువుల పైన భారీ సుంకాలు విధించనున్నట్లు, ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి భారత్ తీసుకువెళ్ళింది. భారత్ ఉత్పత్తుల పైన అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతీకార సుంకాలు విధించేందుకు రెడీ అయింది.

Modi mark shock to Trump India to impose retaliatory tariffs

Take a Poll

ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద భారత్ ఆందోళన
అమెరికా ఉత్పత్తులైన కొన్ని ఎంపిక చేసిన వాటికి కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించుకోవటంతో పాటు, వాటిపై దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచుతున్నట్టు భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. అమెరికా తీసుకున్న ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలు భారతదేశ ఎగుమతులపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది.

యూఎస్ టారిఫ్ ధోరణికి భారత్ ప్రతిస్పందన
మొత్తం 7.6 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భారత్ ఆందోళన చెందుతుంది. ఇక యూఎస్ అనుసరిస్తున్న ఈ ధోరణి లను గతంలోనే తప్పు పట్టిన భారత్ ప్రస్తుతం టిట్ ఫర్ టాట్ అన్నట్టు నిర్ణయం తీసుకుంది.

ట్రంప్ టారిఫ్ ల తీవ్ర ప్రభావం
డోనాల్డ్ ట్రంప్ యూఎస్ కు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పైన భారీగా సుంకాలు విధించిన క్రమంలో ప్రపంచంలోనే ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండు అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ పైన ఈ సుంకాల ప్రభావం బాగా పడింది. ఈ క్రమంలోనే తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ ముందు ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తుంది.

భారత్ నిర్ణయంతో షాక్.. ఏం జరగబోతుందో?
ఇదిలా ఉంటే భారత్ అమెరికా దేశాల మధ్య నూతన వాణిజ్య ఒప్పందాల చర్చలు తుదిదశకు చేరుకుంటున్నాయి అని చెబుతున్న క్రమంలో తాజాగా భారత్ ప్రతీకార చర్యల నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది ఏమైనా భారత్ నిర్ణయం ట్రంప్ కు షాక్ అని చెప్పాలి. మరి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పైన ట్రంప్ ఏ విధంగా ప్రతి స్పందిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+