సోదరుడికి సుఫారి ఇచ్చి కూతురును చంపించిన తల్లి

కూతురు కిరణ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. కానీ, అది విఫలమవడంతో ఆమె పుట్టింటికి వచ్చేసి విడాకులకు దరఖాస్తు చేసింది. తల్లిదండ్రుల దగ్గర ఉంటూ స్థిరాస్తి వ్యాపారంలోకి దిగింది. ఈ క్రమంలో ఆమె మద్యపానం, ధూమపానం చేస్తుండేది. వీటికి తోడు వ్యాపారంలో తన భాగస్వామితో కిరణ్ సన్నిహితంగా ఉండటంపై పుష్పా కోహ్లి ఆగ్రహంతో రగిలిపోయేది.
కూతురికి ఎంత చెప్పినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఆమెను హతమార్చి ఇంటి పరువు కాపాడుకోవాలనుకునే నిశ్చయానికి వచ్చిందామె. జలంధర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న తన సోదరుడు కుల్వీందర్ సింగ్‌ను సంప్రదించి లక్ష రూపాయలకు బేరం కుదుర్చుకుని కూతుర్ని చంపేయడానికి ప్రణాళిక వేసింది.
గత ఏడాది డిసెంబర్ 27న భర్తను, కొడుకును భటిండాలో ఉన్న బంధువుల ఇంటికి పంపి తాను మాత్రం కూతురితో పాటు ఇంట్లో ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం కుల్వీందర్ మరో వ్యక్తితో కలిసి కిరణ్ గదిలోకి ప్రవేశించి నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోసేశారు. ఇద్దరు మహిళలు బురఖా ధరించి వచ్చి తన కూతుర్ని హత్య చేశారని పుష్ప పోలీసులకు చెప్పింది. అయితే దర్యాప్తులో అసలు దోషి కిరణ్ తల్లేనని తేలింది.












Click it and Unblock the Notifications