పీఎం మోడీని పొగిడి.. వారికి 10కోట్ల విరాళం: మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒడిశాలోని బాలాసోర్ లో తాజాగా జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు 10 కోట్ల రూపాయలను విరాళంగా పంపించారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు తన లాయరు ద్వారా సుఖేష్ చంద్ర శేఖర్ ఈ చెక్కును పంపించారు. తాను న్యాయంగా సంపాదించిన దాని నుండే ఈ సహాయం చేస్తున్నానని సుఖేష్ చంద్ర శేఖర్ పేర్కొన్నారు. ఈ మేరకు సుఖేష్ చంద్రశేఖర్ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కు ఒక లేఖ రాశారు.

 Sukesh Chandrasekhar

ఒడిస్సా రైలు ప్రమాద బాధితుల కోసం తాను పంపించిన 10 కోట్లను స్వీకరించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. ఇది తన వ్యక్తిగత నిధి నుండి చట్టబద్ధమైన సంపాదన నుండి పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుల కోసం ఈ నిధులు ఉపయోగించవచ్చని ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలిపారు.

రైలు ప్రమాద ఘటనను దురదృష్టకర దుర్ఘటనగా పేర్కొన్న ఆయన ఈ విషాదం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, ఈ ప్రమాద ఘటనలో బాధితుల కోసం తాను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని అందజేస్తున్న కారణంగా బాధ్యతాయుతమైన మంచి పౌరుడిగా ఈ సాయం చేస్తున్నానన్నారు.

తాను పది కోట్ల రూపాయల నిధిని బాధిత కుటుంబాల పిల్లల కోసం, వారి భావి భవిత కోసం, చదువు ఖర్చులకోసం పంపించానని సుఖేష్ చంద్ర శేఖర్ లేఖలో తెలిపారు. సత్వర చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీని, రైల్వేని ప్రశంసించారు. గౌరవ ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం ఆపత్కాలంలో ప్రజల కోసం నిలబడడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.సుఖేష్ చంద్రశేఖర్ అనేక సేవా కార్యక్రమాలను కూడా తాను తన సంస్థల ద్వారా చేస్తు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+