Viral Video: ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. మెట్రో రైలులో కోతి సందడి

దిల్లీ మెట్రో నిత్యం రద్దీగా ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులతో కాలు పెట్టేంత చోటు కూడా లేకుండా నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. అయితే తాజాగా దిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మెట్రో రైలు లోపలికి ప్రవేశించిన ఒక కోతి, ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన దృశ్యాలు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజలు భయంతో కేకలు వేయకుండా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో కోతి మెట్రో కోచ్ లోపల చాలా ప్రశాంతంగా ఒక చివర నుండి మరో చివరకు నడుస్తూ కనిపించింది. మధ్య మధ్యలో కోచ్‌ లోని ఖాళీ సీట్లపైకి దూకుతూ చుట్టుపక్కల వారిని గమనించింది. సాధారణంగా కోతులను చూస్తే ప్రజలు భయపడతారు. కానీ ఇక్కడి ప్రయాణికులలో ఎలాంటి ఆందోళన లేదు. కోతి చాలా మంది ప్రయాణికులకు సమీపంగా వెళ్లినప్పటికీ, వారు తమ ఫోన్లను చూసుకుంటూ సీట్లలోనే కూర్చున్నారు.

ఈ క్రమంలో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆ కోతి నెమ్మదిగా వెళ్లి ఒక మహిళ ఒడిలో కూర్చుంది. ఆ సమయంలో ఆ మహిళ ఏమాత్రం కంగారుపడకుండా, ఎలాంటి హడావిడి చేయకుండా స్థిమితంగా ఉండిపోయింది. కొద్ది క్షణాల పాటు ఆమె ఒడిలోనే కూర్చున్న ఆ మూగజీవి, ఆ తర్వాత నెమ్మదిగా లేచి సీట్లపైకి దూకుతూ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె చూపిన ధైర్యం అందరినీ ఆకట్టుకుంది.

ఇంటర్నెట్‌ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన లక్షలాది మంది నెటిజన్లు ప్రయాణికుల ప్రవర్తనను ఎంతగానో అభినందిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కేకలు వేయడం, భయంతో పరుగులు తీయడం లాంటివి చేస్తే ఆ జంతువు మరింత దూకుడుగా మారే అవకాశం ఉంటుంది. కానీ, ఈ కోచ్‌లోని ప్రయాణికులు చూపిన ఓర్పు, సమయస్ఫూర్తి కారణంగానే ఆ కోతి ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Monkey Boards Delhi Metro and Playfully Interacts with Passengers Viral Video Delhi Metro Monkey

ఈ సంఘటన ఏ మెట్రో మార్గంలో జరిగింది, ఎప్పుడు జరిగిందనే విషయాలపై స్పష్టమైన ఆధారం లేకపోయినప్పటికీ, ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. కొందరు నెటిజన్లు కోతిని 'మెట్రోలో అత్యంత క్రమశిక్షణ కలిగిన ప్రయాణికుడు' అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు భారత్ లోనే సాధ్యమవుతాయని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానించడం విశేషం.

ఏదేమైనా.. ఏదైనా విపత్తు లేదా ఊహించని సవాలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా వ్యవహరిస్తే ఎలాంటి ప్రమాదాన్నయినా నివారించవచ్చని ఈ మెట్రో ప్రయాణికులు నిరూపించారు. ప్రయాణికులు ప్రదర్శించిన ఈ ఓర్పు, సమర్థవంతమైన ప్రవర్తన కేవలం మెట్రో ప్రయాణంలోనే కాదు, జీవితంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+