Monkeypox vaccine : త్వరలో మంకీపాక్స్ వ్యాక్సిన్- కేవలం వారికే-కేంద్రం కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వాటితో పాటే భయాలూ పెరుగుతున్నాయి. కేరళలో ప్రారంభమైన ఈ మంకీపాక్స్ కేసులు ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ కారణంగానే కరోనా వ్యాప్తి తగ్గిందని భావిస్తున్న జనం.. ఇప్పుడు మంకీపాక్స్ కు కూడా వ్యాక్సిన్ తీసుకుందామనే భావనలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం కేంద్రం ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

మంకీపాక్స్‌పై అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలపై రాజ్యసభలో ఎంపీలు ఇవాళ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ.. కేంద్రప్రభుత్వం మంకీపాక్స్ పై ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని, వ్యాధిపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పని చేస్తున్నందున ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన కోరారు.

Monkeypox vaccination not necessary for everyone- centre clarified in parliament

మంకీపాక్స్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్‌ల గురించి సభ్యులు అడిగన ప్రశ్నపైనా మంత్రి మాండవీయయ స్పందించారు. మంకీపాక్స్ వ్యాధికి సరైన టీకాను కనుగొనడానికి ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి చెప్పారు. వ్యాధి సోకిన వారితో సన్నిహిత సంబంధంలో ఉన్న వ్యక్తులను మాత్రమే కాంటాక్ట్ ట్రేసింగ్, టీకాలు వేయడం అవసరమని ఆయన వెల్లడించారు. అలాగే ఈ వ్యాధికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అవసరం లేదన్నారు. మన శాస్త్రవేత్తలు మంకీపాక్స్ వైరస్‌ను వేరు చేశారని ఆయన వెల్లడించారు. వారు భారతదేశంలోనే వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేస్తారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పష్టంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+