24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు: ఐఎండీ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. మే 30-31 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.
రాబోయే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి రుతుపవనాలు కేరళలో సమయం కంటే ముందే వస్తున్నాయి. ఇక, వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య, మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల వరకు క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బుధవారం కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అంతేగాక, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు జూన్ 5 నాటికి చేరుతాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగువ భాగం, పశ్చిమ బెంగాల్‌కు జూన్ 10న చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది.
గతేడాది జూన్ 8న రుతుపవనాలు ఒక వారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఐఎండీ ప్రకారం.. కేరళలో సాధారణ రుతుపవనాలు జూన్ 1న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అది ఉత్తరం వైపుగా, జూలై 15 నాటికి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు పురోగమిస్తుంది. రుతుపవనాలు సాధారణంగా ఈశాన్య భారతదేశంలో జూన్ 5 నాటికి పురోగమిస్తాయి. కానీ, కొన్ని సంవత్సరాలలో రుతుపవనాల బంగాళాఖాతంలో చురుకుగా ఉందని, రుతుపవనాలు ఈశాన్య భారతదేశం మీదుగా అదే సమయంలో పురోగమిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
"రెమల్' తీవ్ర తుఫాను కారణంగా రుతుపవనాలతో బంగాళాఖాతం చాలా చురుకుగా ఉంది, ఇది ఈ ప్రాంతంలో రుతుపవన ప్రవాహాన్ని లాగింది. గత రెండు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా, గత రెండు రోజులుగా కేరళలో కూడా అన్ని రుతుపవనాల ప్రారంభ ప్రమాణాలు నెరవేరుతున్నాయి అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర అన్నారు.












Click it and Unblock the Notifications