మాన్సూన్ అప్‌డేట్: రాజస్థాన్, ఎంపీ, గుజరాత్, కేరళలో అతి భారీ వర్షాలు
న్యూడిల్లీ: తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
Recommended Video

ఉత్తరాఖండ్, హర్యానా, ఛండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

అండమాన్ నికోబార్ దీవులపై గంటకు 35-45కి.మీ వేగంతో విపరీతమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆగ్నేయం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం ఉంది. దక్షిణ గుజరాత్‌లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్పపీడనం, తుఫానుల కారణంగా రానున్న 48గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications