దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్, సీఎం పేరుకంటే ఈ పేరు వైరల్, గురుగ్రామ్ లో కురుక్షేత్రం !

హరియాణ/గురుగ్రామ్: హరియాణలోని నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడంతో ఆ హింస గురుగ్రామ్ కు వ్యాపించింది. రెండు రోజుల క్రితం భజరంగ్ ధళ్ నాయకుడు మోను మనేసర్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో హరియాణలో మత ఘర్షణలకు కారణం అయ్యిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ గొడవలు మొదలు కావడంతో అమాయకులు బలి అయ్యారు.

హరియాణలోని నూహ్ జిల్లాలో జరిగిన గొడవల్లో వందలాది మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో పోలీసులు ఉన్నారు. రాత్రి నూహ్ జిల్లా నుంచి ఈ గొడవలు గురుగ్రామ్ కు వ్యాపించాయి. గురుగ్రామ్ కూడా అల్లర్లతో అట్టుడికిపోతున్నది, రాత్రిపూట మసీదును తగలబెట్టడానికి కొందరు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

monumanesart
గురుగ్రామ్ లోని రెస్టారెంట్లు, హోటల్స్, షాపులు, పలు ప్రాంతాల్లో నివాస ప్రాంతాలకు అల్లరిమూకలు నిప్పంటించారు. ఇక రెస్టారెంట్ల మీద రాళ్ల దాడులు చేసి వాటిని ద్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లు నమ్మవద్దని, తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తాయని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ప్రజలకు పదేపదే మనవి చేస్తున్నారు.

నూహ్ లో జరిగే మతపరమైన ఊరేగింపుకు తాను హాజరు అవుతానని, తన మద్దతుదారులతో పాటు హిందువులు అందరూ హాజరు కావాలని ఇటీవల భజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ ఓ వీడియో పోస్టు చేశారు. చాలా కాలం నుంచి మోను మనేసర్ కోసం పోలీసులతో పాటు కొన్ని ముస్లీం సంఘాలు గాలిస్తున్నాయి. అయితే మోను మనేసర్ మాత్రం ఎవ్వరికి చిక్కలేదు.

haryanaviolencespreadstomoregurugramareas

విశ్వహిందు పరిషత్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను వ్యక్తిగతంతో ఈ సమావేశానికి హాజరు అవుతున్నానని మోను మనేసర్ చెప్పారని జాతీయ మీడియా అంటోంది. అయితే ఇద్దరు ముస్లీం వ్యక్తుల హత్య కేసులో కొన్ని నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న మోను మనేసర్ ర్యాలీకి హాజరౌతున్నాడని తెలుసుకున్న మరో వర్గం వాళ్ల రగిలిపోవడంతో హింసకు దారితీసింది.

రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన జువైద్, నాసీర్ అనే ఇద్దరు 2019 ఫిబ్రవరి నెలలో దారుణ హత్యకు గురైనారు. కాలిపోయిన కారులో ఇద్దరి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాసిర్, జువైద్ ను భజరంగ్ దళ్ కార్యకర్తలే చంపేశారని అప్పట్లో వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదే కేసులో మెను మనేసర్ పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.

haryanaviolencespreadstomoregurugramareas2

హరియాణలో గోసంరక్ష్ కమిటీలకు మోను మనేసర్, మోహిత్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నూహ్ లో మొదలైన గొడవలు ఇప్పుడు గురుగ్రామ్ కు వ్యాపించడంతో మోను మనేసర్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. హరియాణ పేరు చెబితే ఇప్పుడు ఆక్కడి సీఎం పేరు కంటే మోను మనేసర్ పేరే ఎక్కువగా వినపడుతోందని స్థానిక మీడియా అంటోంది.

అయితే మోను మనేసర్ విషయంలో భజరంగ్ దళ్, విశ్వహిందు పరిషత్ తో పాటు పలు హిందూ సంఘ, సంస్థలు ఆచితూచి మాట్లాడుతున్నాయి. అయితే మోను మనేసర్ విషయంలో ముస్లీం సంఘాలు మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రెండు వర్గాల గొడవల కారణంగా గురుగ్రామ్ లో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, హోటల్స్, దుకాణాలు బుధవారం కూడా మూతపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+