బీజేపీ పార్లమెంటరీ మీట్: కేంద్రమంత్రి కృష్ణరాజ్‌కు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, సమావేశం మొదలైన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కృష్ణరాజ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
Delhi: MoS Agriculture Krishna Raj fell ill during BJP parliamentary party meeting at Parliament's Library Building, rushed to RML hospital for treatment. pic.twitter.com/lnINcuJNJw
— ANI (@ANI) December 20, 2017
కాగా, పార్లమెంటరీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర నేతలు పాల్గొన్నారు.
#WATCH: Earlier Visuals from BJP's Parliamentary Party meeting underway at Parliament Library Building in Delhi. pic.twitter.com/TZAX6OBw8h
— ANI (@ANI) December 20, 2017
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను పార్టీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అమిత్ షా స్వీట్ తినిపించారు.












Click it and Unblock the Notifications