దోమల దండయాత్ర; ఉలిక్కిపడ్డ నగరం; షాకింగ్ వీడియోలు!!
దండయాత్ర అంటే అందరూ వినే ఉంటాం.. దండయాత్ర అంటే మూకుమ్మడిగా దాడి చేయడం.. ఇక దోమల దండయాత్ర ఎప్పుడూ చూసి ఉండం.. కానీ పూణేలోని ముఠా నదిపై దోమల టోర్నడో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దోమల సుడిగాలిగా చెప్పే ఈ దోమల దండయాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నగరంలోని ముంధ్వా, కేశవనగర్, ఖరాడి ప్రాంతాలలో దోమల దండయాత్ర ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. పూణే వాసులు ఇప్పుడు దోమల సమస్యతో పోరాటం చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న దోమలు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సామాన్యుల నుండి విలాసవంతమైన గృహాలలో నివసించే వారి వరకు ప్రతి ఒక్కరు అక్కడ దోమల బెడదను ఎదుర్కొంటున్నారు.

కనీసం తలుపులు తెరిచి బయటకు రావాలంటే, కాసేపు బాల్కనీలో కూర్చోవాలంటే ఇబ్బంది పడేంతగా దోమలు విజృంభిస్తున్నాయి. బయట పార్కులకు వెళ్లడం, పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లడం సైతం ప్రస్తుతం నిషేధించబడ్డాయి అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపల్ అధికారుల పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. త్వరితగతిన దోమల ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలని, విపరీతమైన దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. కొంతమంది పూణే మున్సిపల్ కార్పొరేషన్ పైన అసహనంతో పోస్టులు పెడుతున్నారు.
సమయానికి మున్సిపల్ ట్యాక్స్ లు పే చేస్తున్న ప్రజలకు పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాలెంటెన్స్ గిఫ్ట్ గా దోమలను పంపిందని మండిపడుతున్నారు. మూల ముఠా నది గర్భంలో కొనసాగుతున్న ప్రాజెక్టులలో, ఆనకట్టతో పాటు నీటి శుద్ధి కర్మాగారం ఉన్నాయని చెబుతున్నారు. ప్రాజెక్టుల వల్ల అక్కడ నీటి ప్రవాహం తగ్గి, మురుగు చేరి దోమల వృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా దోమల తుఫాను తమ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతుందని వారు అంటున్నారు.
Thanks @PMCPune for giving Valentine gift of Mosquitoes Tornado to Keshav Nagar Pune Residents in return to their timely municipality tax payments.#Justiceforkeshavnagar @ThePuneMirror @CMOMaharashtra @PMOIndia @PuneCivic @eshan_tupe @eshan_tupe @WagholiHSA @ShivSenaUBT_ pic.twitter.com/iQxSb5tj8Y
— Rakesh Nayak (@Rakesh4Nayak) February 8, 2024
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications