నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్ హతం..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద కుట్రకు పాల్పడిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్‌ను ఢిల్, బీహార్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాయవ్య ఢిల్లీలో తెల్లవారుజామున సుమారు 2:20 గంటల సమయంలో గ్యాంగ్‌స్టర్లు పోలీసులను ఎదుర్కొని కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. తప్పించుకోవాలని ప్రయత్నించడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే నలుగురు గ్యాంగ్‌స్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే అప్పటికే గ్యాంగ్‌స్టర్లు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతులును సిగ్మా గ్యాంగ్‌కు చెందిన వారుగా గుర్తించారు.

మృతుల వివరాలు..
రంజన్ పాఠక్ (25)
బిమ్లేష్ మహ్తో (25)
మనీష్ పాఠక్ (33)
అమన్ ఠాకూర్ (21)
రంజన్ పాఠక్ పై రూ.25,000 రివార్డు ఉంది. బీహార్‌లో సీతామర్హి సహా పరిసర జిల్లాల్లో ఐదు హత్యలతో సహా మొత్తం ఎనిమిది క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, రంజన్ పాఠక్ సోషల్ మీడియా, ఆడియో సందేశాల ద్వారా పోలీసులకు బహిరంగ సవాళ్లు విసిరినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల లభించిన ఆడియో క్లిప్‌లో, బీహార్ ఎన్నికలకు ముందు గ్యాంగ్ పన్నిన భారీ కుట్రకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. గత ఏడేళ్లలో ఈ గ్యాంగ్ హత్యలు, బెదిరింపులు, కాంట్రాక్ట్ కిల్లింగ్‌ల వంటి అనేక నేరాలకు పాల్పడింది.
ఇక ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నారు. మిగిలిన గ్యాంగ్ నెట్‌వర్క్, ఇతర నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు అన్ని కోణాల నుంచి ఫైల్‌లు, వీడియో, సాక్ష్యాలను సేకరించి.. మిగతా మోస్ట్ వాంటెడ్ సభ్యులపై వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఘటన బీహార్‌లో ఎన్నికల ముందు సెక్యూరిటీ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications