Hospital: ఆసుపత్రిలో ఒకేసారి తల్లీ,కూతురు దారుణ హత్య, భర్త ఫ్రెండ్ హంతకుడు ?, మత్తుమందుతో ?
అహమ్మదాబాద్/గుజరాత్: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో దారుణం జరిగింది. భర్తతో గొడవపడిన భార్య ఆమె పుట్టింటిలో ఉంటున్నది. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను కూతురు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లింది. కొన్ని గంటల తరువాత ఆసుపత్రి సిబ్బంది ఓ కబోడ్ తీసి చూస్తే అందులో మహిళ శవమై కనిపించింది. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు షాక్ అయ్యారు. మహిళ ఒంటరిగా ఆసుపత్రికి రాలేదని, ఆమె తల్లికూడా వచ్చిందని గుర్తించారు. ఆసుపత్రిలో గాలించగా మహిళ తల్లి కూడా పేషెంట్ బెండ్ కింద శవమై కనిపించడం కలకలం రేపింది.

భర్తకు దూరంగా ఉంటున్న మహిళ
గుజరాత్ లోని మణినగర్ లో భారతీ వాలా అలియాస్ భారతీ (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఆరు సంవత్సరాల క్రితం భారతీకి ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. వివాహం అయినప్పటి నుంచి భారతీకి, ఆమె భర్తకు గొడవలు జరుగుతున్నాయి. విసిగిపోయిన భారతీ ఆమె భర్తకు దూరం అయ్యి నరోల్ ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లిపోయింది.

తల్లికి అనారోగ్యం
భారతీ తల్లి చంపా అనారోగ్యంతో బాధపడుతోంది. చంపాను ఆమె కూతురు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లి చికిత్స చేయిస్తోంది. కొంతకాలంగా భారతీ, ఆమె తల్లి చంపా ఆసుపత్రికి తిరుగుతున్నారు. చంపాకు కాలునొప్పి ఎక్కువ కావడంతో భారతీ ఆమెను గురువారం ఉదయం ఆసుపత్రికి పిలుచుకుని వెలుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది.

ఇఎన్ టీ ఆసుపత్రిలో కబోడ్ లో భారతీ శవం
మణినగర్ లోని భులాభాయ్ పార్క్ సమీపంలో ఇఎన్ టీ ఆసుపత్రి ఉంది. ఆ ఆసుపత్రిలోకి భారతీ, ఆమె తల్లి వెళ్లారు. కొన్ని గంటల తరువాత ఆసుపత్రి సిబ్బంది కబోడ్ లో ఉన్న బెడ్ షీట్లు తీసుకోవడానికి వెళ్లారు. ఆ సందర్బంలో కబోడ్ లో భారతీ శవమై కనిపించింది. భారతీ గొంతు మీద బలమైన గాయాలు ఉండటంతో ఆసుపత్రి సిబ్బంది మణినగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బెడ్ కింద తల్లి శవం
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానం వచ్చి సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు షాక్ అయ్యారు. భారతీ ఒంటరిగా ఆసుపత్రికి రాలేదని, ఆమె తల్లి చంపా కూడా వచ్చిందని గుర్తించారు. ఆసుపత్రిలో గాలించగా భారతీ తల్లి చంపా కూడా ఓ రూమ్ లో ఖాళీగా ఉన్న పేషెంట్ బెండ్ కింద శవమై కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది హడలిపోయారు.

భర్త స్నేహితుడు హంతకుడు ?
ఉదయం 9 గంటల నుంచి 9. 30 గంటల మద్య హత్య జరిగిందని పోలీసులు అంటున్నారు. ఆ సమయంలో డాక్టర్ ఆసుపత్రిలో లేడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇఎన్ టీ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేసే మన్సుఖ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి కాంపౌండర్ కు భారతీ భర్తకు చాలాకాలం నుంచి పరిచయం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మత్తు మందు ఇంజక్షన్ వేసి గొంతు నులిమి హత్య
భారతీ, ఆమె తల్లి చంపాకు మత్తుమందు ఇంజక్షన్ వేసి తరువాత గొంతులు నులిమి హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మన్సుఖ్ మొదట భారతీని హత్య చేశాడని, ఆ సమయంలో అడ్డు వెళ్లిన ఆమె తల్లిని కూడా హత్య చేశాడని పోలీసులు అంటున్నారు. అయితే తల్లీ కూతురు చంపా, భారతీని ఎందుకు హత్య చేశారు ?, కాలు నొప్పి అని ఆసుపత్రికి వెళ్లిన తల్లీ కూతురు ఇఎన్ టీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు ?, ఇద్దరిని మన్సుఖ్ ఎందుకు హత్య చేశాడు అని పూర్తి సమాచారం సేకరిస్తున్నామని మణినగర్ పోలీసు అధికారులు అంటున్నారు. కాంపౌండర్ మన్సుఖ్ కు, భారతీకి ఏమైన సంబంధం ఉందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications