Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Mother's Day 2021: అమ్మ కోసం ఒక్క రోజేనా! ప్రతి రోజు అమ్మదే కావాలి..ఎందుకంటే!

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. ఇక అమ్మను గురించి ఆ తల్లి ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైలిలో వర్ణించారు. " ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను" అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్‌. అందుకే చరిత్రలో అమ్మకంటూ ఒక రోజును కేటాయించారు. అమ్మ తన పిల్లల కోసం పడే తపనకు , వారి ఉన్నతి కోసం చేసే కష్టానికి జీవితకాలం అమ్మకు ఊడిగం చేసినా సరిపోదు అనే భావన కలిగిన నాడు అమ్మలంతా సంతోషంగా ఉంటారు. త్యాగమే పరమావధి గా తన జీవితాన్ని, తన సంతోషాన్ని బిడ్డల కే అంకితం చేసే అమ్మ కు ఒక్క రోజు సరిపోదనే భావన కలుగుతుంది. మదర్స్ డే రోజున అమ్మ గొప్పతనం చెప్పుకునే ముందు నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మ కోరుకునేది ఏమిటి ..? అమ్మ ఋణం తీర్చుకోవాలంటే ఏమి చెయ్యాలి ? వంటి అంశాలతో ప్రత్యేక కథనం

Recommended Video

    Mother's Day : I Love You Amma - Mothers Day Special | Oneindia Telugu

    అమ్మ ప్రేమ పొందని బ్రతుకు వ్యర్ధం... అమ్మ ఒడి భూతల స్వర్గం

    అమ్మ ప్రేమ పొందని బ్రతుకు వ్యర్ధం... అమ్మ ఒడి భూతల స్వర్గం

    అమ్మ అన్న పిలుపే ఒక ఆర్ద్రమైన భావన .. మనసుకు హత్తుకునే మధురమైన పదం అమ్మ . సృష్టి లోనే అత్యంత అద్భుతమైన పదం అమ్మ అందుకే అంటారు సృష్టి కర్త అయిన బ్రహ్మ ను సృష్టించింది కూడా ఒక అమ్మే అని. అలాంటి అమ్మ విలువ ఎంత అంటే పంచ భూతాలు సైతం చెప్పలేనంత . ముక్కోటి దేవతలు సైతం శిరసు వంచి నమస్కరించేంత . కుభేరుడు సైతం లెక్క కట్టలేనంత . అలాంటి అమ్మ ప్రేమ పొందని బ్రతుకు వ్యర్ధం. అమ్మ ఒడి భూతల స్వర్గం . ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అమ్మ కాలం తో పాటు తన బిడ్డల కోసం బహుముఖ పాత్రలను పోషిస్తుంది .

    పిల్లల కోసమే అమ్మల మల్టీ టాస్కింగ్

    పిల్లల కోసమే అమ్మల మల్టీ టాస్కింగ్

    ఒకపక్క ఉద్యోగం , మరోపక్క పిల్లల చదువులు, ఇంకో పక్క ఇంటెడు చాకిరీ , పిల్లల కోసం భర్తకు చేదోడు వాదోడుగా సాగించే ప్రయాణం, ఇలా ఎన్నో పనుల వత్తిడితో సతమతమవుతున్నా బిడ్డల ఉన్నతి చూసి తన కష్టాన్ని మరచిపోతుంది. తన సంతోషాన్ని బిడ్డల ఆనందంలో వెతుక్కుంటుంది అమ్మ . పిల్లలకు చిన్న కష్టం కలిగినా మొదట కన్నీరు వచ్చేది తల్లికే . బుడి బుడి అడుగుల బుడతడి దశ నుండి నడక నేర్పి, నడత నేర్పి , సమాజంలో బ్రతికే విధానం నేర్పి , తన బిడ్డ తప్పటడుగులను, తప్పుటడుగులను దిద్దుతుంది అమ్మ.

     అమ్మలను నిర్లక్ష్యం చేస్తూ వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న పిల్లలు

    అమ్మలను నిర్లక్ష్యం చేస్తూ వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న పిల్లలు

    అమ్మ అన్న పదానికి నిర్వచనం ఎంత చెప్పినా తక్కువే.. అమృతానికి , అర్పణ కు అసలు పేరు అమ్మ .. అనుభూతి కి , ఆలంబన కు ఆనవాలు అమ్మ .... ఈ లోకమనే గుడి చేరగా తొలి వాకిలి అమ్మ అని ఒక మహాకవి చెప్పినట్టు అమ్మ గురించి ఎంత చెప్పినా రుచించేది చాలా తక్కువ మందికి . తమ ఉన్నతి కోసం అమ్మ జీవితాన్నే త్యాగం చేస్తే చివరకు తల్లిని కూడా చూడలేని పరిస్థితిలో చాలా మంది వారిని వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు . తన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల బాగు కోసం కడుపు కట్టి కూడబెట్టి పెద్ద చదువులు చదివిస్తే చివరకు అనాధలు గా అమ్మలను మారుస్తున్న బిడ్డలున్నారు. ఇది చాలా బాధాకరం .

    బ్రతికుండగానే అమ్మలను దూరం చేసుకున్న వాళ్ళకి అన్నీ ఉన్నా దరిద్రమే

    బ్రతికుండగానే అమ్మలను దూరం చేసుకున్న వాళ్ళకి అన్నీ ఉన్నా దరిద్రమే

    అమ్మ కోరుకునేది కొడుకు సంపాదించే డబ్బు కాదు . కొడుకు చూపించే కాసింత ప్రేమ. అమ్మా అని పిలిచే పిలుపు . కొడుకు గొప్పగా బ్రతుకుతున్నాడంటే ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. అదే ఆ కొడుకుకు చిన్న కష్టం వచ్చిన విలవిలలాడేది మొదట అమ్మే . అటువంటి మాతృ మూర్తులు ఎందరో కంట తడి పెడుతూ కూడా నా కొడుకు ఎక్కడున్నా , నా బిడ్డ ఎక్కడున్నా సుఖం గా వుండాలని కోరుకుంటారు. అది అమ్మ మనసు.అలాంటి అమ్మలను బతికుండగానే దూరం చేసుకుంటున్న వాళ్ళది అసలైన దౌర్భాగ్యం. కోట్లు కూడబెట్టినా వాళ్ళది చెప్పలేనంత దరిద్రం . అమ్మ ప్రేమ లేని చోట ఎన్ని సిరి సంపదలుంటే ఏం లాభం చెప్పండి .

    తన బిడ్డల కోసమే అమ్మ స్వార్ధం .. చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లే హృదయం

    తన బిడ్డల కోసమే అమ్మ స్వార్ధం .. చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లే హృదయం

    తల్లి ఎప్పుడూ బిడ్డల ఆకలి చూస్తుంది. పిల్లలకు చిన్న కష్టం వచ్చినా కన్నీరొలుకుతుంది తల్లి హృదయం . నిష్కల్మషం గా ప్రేమించి తాను పస్తు వున్నా బిడ్డల కడుపు నింపే అమ్మ చాలా స్వార్ధపరురాలు ఎందుకంటె తాను చనిపోయేదాకా నా కొడుకు, నా బిడ్డ అని తన ప్రాణాన్ని బిడ్డల పైనే పెట్టుకుని బ్రతుకుతుంది కాబట్టే అమ్మ స్వార్ధ పరురాలు. అయితే ఆ స్వార్ధం బిడ్డల జీవితాన్ని స్వర్గం లా మార్చాలనే ఆలోచన ఉంటుంది. చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగిలిన కొడుకు కన్నా, అమ్మ ప్రాణమే ఎక్కువ విలవిలలాడుతుంది. భగవంతుడా నా బిడ్డలను కాపాడు అని పదే పదే మొక్కుతుంది అమ్మ . అక్కడ కూడా తన గురించి ఎలాంటి కోరిక లేకుండానే అమ్మ జీవిస్తుంది . అమ్మ ఒక స్నేహిత ,అమ్మ ఆది గురువు, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి తొలి ప్రేమ అమ్మ .అలాంటి అమ్మ ఋణం ఎలా తీర్చుకోవాలి అంటే

     కాసింత ప్రేమ , సమాజంలో కాస్త గౌరవం .. అమ్మ కోరుకునేది ఇదే

    కాసింత ప్రేమ , సమాజంలో కాస్త గౌరవం .. అమ్మ కోరుకునేది ఇదే

    మీకు జన్మనిచ్చి సమాజానికి మిమ్మల్ని ముద్దుల యువ రాజు గానో,యువరాణి గానో పరిచయం చేసిన అమ్మ నువ్వు గొప్పగా ఎదగాలనుకుంటుంది. సభ్యత, సంస్కారం , చదువు ,ఇంగిత జ్ఞానం వున్న వ్యక్తి గా నీవు ఎంచుకున్న రంగం లో ఉన్నత స్థాయి కి చేరితే అమ్మ పొందే ఆనందానికి అవధులు వుండవు. ఇక మనం కూడా సాధిచే విజయాలే కాదు జీవించే జీవితం అంతా అమ్మ భిక్షే అని గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. నవ మాసాలు మోసి కనీ పెంచిన తల్లి కి కాసింత ప్రేమ , సమాజం లో కాస్త గౌరవం దక్కితే చాలు ఆ తల్లి ఎంతగానో సంతోషిస్తుంది .

     ఒక్క రోజు ప్రేమ వద్దు .. అన్ని రోజులు అమ్మవే కావాలి

    ఒక్క రోజు ప్రేమ వద్దు .. అన్ని రోజులు అమ్మవే కావాలి

    తన పిల్లలు తన పట్ల ప్రేమ చూపిస్తే నెమలి సింహాసనం మీద కూర్చున్నంత , ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఆనందపడుతుంది ఆ తల్లి . సంవత్సరానికి ఒక సారి కాళ్ళు మొక్కి సంవత్సరమంతా తిట్టే బిడ్డలు కాదు కావాల్సింది. అమ్మను గౌరవించే వాళ్ళు,ప్రేమించే వాళ్ళు కావాలి. ఏడాది కోరోజు కాదు అమ్మ కోసం కేటాయించాల్సింది. ప్రతి రోజు అమ్మ రోజే కావాలి. నిన్ను ప్రేమించిన అమ్మ ను నువ్వు ప్రేమిస్తే చాలు ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు . తన పిల్లల ప్రేమ కోసం నిత్యం పరితపించే మనసు ఏదైనా ఉంటె అది తల్లి మనసే . అందుకే కాసింత ప్రేమ , అమ్మ అన్న గౌరవం ఉంటె చాలు ..అమ్మలంతా సంతోషంగా జీవిస్తారు. ఈ రోజే కాదు ఏ రోజైనా అమ్మ రోజే కావాలి. అమ్మ మీద ప్రేమతో ప్రతి ఒక్కరూ మెలగాలి . మాతృ దినోత్సవం నాడే కాదు అమ్మ మీద ప్రేమ ప్రతి రోజూ ఉండాలి ఎందుకంటే అమ్మ ఎప్పుడూ ప్రత్యేకమే .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+