పసికందుపై తల్లి కర్కశం: ఏడుస్తున్న బిడ్డను చావబాదిన తల్లి, వీడియో వైరల్!!
అమ్మ అన్నపదానికి అర్థం మరచిన ఓ తల్లి బిడ్డను అత్యంత దారుణంగా హింసించింది. అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అభం శుభం తెలియని నోరు లేని బిడ్డకు నరకం చూపించింది. నవమాసాలు మోసిన కన్నబిడ్డను ఏ తల్లి అయినా సరే ప్రేమగా చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, బిడ్డల కోసం కష్టపడిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. పిల్లల సంతోషం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసిన త్యాగమయులు ఉన్నారు. కానీ ప్రస్తుతం కన్నబిడ్డలపైనే కర్కశంగా ప్రవర్తిస్తున్న తల్లులు సమాజంలో ఆందోళనకర పరిస్థితులను సృష్టిస్తున్నారు.

పసికందుపై తల్లి కర్కశం... ఏడుస్తున్న బిడ్డను చావబాదిన తల్లి
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో పసికందుపై ఓ తల్లి కర్కశత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపింది. ఓ తల్లి పసికందును కనికరం లేకుండా కొట్టినట్లు చూపించే ఓ దారుణమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం సాంబా జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో ఓ మహిళ తన బిడ్డను అత్యంత దారుణంగా కొట్టింది. ఆ వీడియో క్లిప్ లో, తన ఒడిలో ఏడుస్తున్న పసిపాపతో మంచం మీద కూర్చుని ఉన్న ఓ మహిళ ఎవరితోనో వాదనకు దిగింది. అయితే ఈ క్రమంలో ఒడిలో ఉన్న శిశువు ఏడవటం ప్రారంభించింది. ఏడుస్తున్న పాపను అక్కున చేర్చుకొని బుజ్జగించాల్సింది పోయి దారుణంగా కొట్టింది.
వీడియో వైరల్... పోలీసులు కేసు నమోదు, తల్లి అరెస్ట్
తల్లి కొట్టిన దెబ్బలకు శిశువు గుక్కపెట్టి రోదించింది. గుక్కపెట్టి ఏడుస్తున్నా ఆపకుండా బిడ్డను కొట్టిన తల్లి కర్కశం చూసిన వారందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ వీడియోలో ఉన్న మహిళను గుర్తించిన పోలీసులు జమ్మూ కాశ్మీర్‌లో ట్రేస్ చేసి నిందితురాలిని అరెస్టు చేశారు. చిన్నారిని దారుణంగా కొట్టినందుకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ వీడియో... తల్లిని తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఈ హృదయ విదారక దృశ్యాలను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టగా వీడియో వైరల్ అయింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా తల్లిని దారుణంగా తిట్టిపోస్తున్నారు. అసలు తల్లివేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే పాప పై ఆ తల్లి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చిన్నారిని చితకబాదిన నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గతంలో చిత్తూరు జిల్లాలోనూ కొడుకుపై తల్లి కర్కశం
గతంలో చిత్తూరు జిల్లాలో ఓ శాడిస్ట్ తల్లి తండ్రిపై కోపంతో రోజుకో రకంగా బిడ్డను చిత్ర హింసలకు గురిచేసి ఆ వీడియోలను తండ్రికి పంపేది. నవమాసాలు మోసి కన్న బిడ్డ అన్న కనికారం కూడా లేకుండా విచక్షణా రహితంగా దాడి చేసేది. రక్తం కారుతున్నా, శరీరమంతా దారుణంగా కమిలిపోయినా సరే చావ చితకబాదేది. నవమాసాలు మోసి కన్న కొడుకును కనికరం లేకుండా కాళ్ళు, చేతులు విరిచేసి కర్కశంగా ప్రవర్తించేది. భర్తను వదిలి పెట్టి, ప్రియుడి మోజులో పడిన ఓ తల్లి కన్నబిడ్డను చిత్రహింసలకు గురి చేస్తూ వీడియో చిత్రీకరణ చేసుకుని, నిత్యం పిల్లవాడికి నరకం చూపిస్తూ ఆ వీడియోలను భర్తకు, ప్రియుడికి షేర్ చేసేది. ఇక ఆ తల్లి శాడిస్ట్ వీడియోలు వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications