వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

New Traffic Rules: అన్ని డాక్యుమెంట్లు ఉన్నా జరిమానా కట్టాల్సిందే.. హెల్మెట్ ఉన్నా రూ.2,000 ఫైన్.. ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

New Traffic Rules: మోటారు వాహన చట్టంలో కొత్తగా మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వాహనదారులు మారిన కొన్ని రూల్స్ తెలుసుకుని వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, నాకేం కాదులే అని రోడ్లపైకి వస్తే భారీగా ఫైన్లు చెల్లించుకోక తప్పదు. ఏఏ విషయాలను గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.2,000 జరిమానా ఎందుకంటే..

రూ.2,000 జరిమానా ఎందుకంటే..

నవీకరించబడిన మోటారు వాహన చట్టం ప్రకారం.. వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, హెల్మెట్ ధరించినప్పటికీ ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. ఇలా ఎందుకంటే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో వారితో తప్పుగా ప్రవర్తిస్తే రూ.2,000 జరిమానా విధించబడుతుంది. మోటారు వాహన చట్టంలోని రూల్- 179 వాహనదారులపై చర్యలు ఉంటాయని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు.

ఇలా ఎందుకు..

ఇలా ఎందుకు..

ట్రాఫిక్ పోలీసులు రైడర్‌ను వాహనాలు, ఇతర పత్రాలను గుర్తింపు కోసం అడిగినప్పుడు తరచుగా వారు అధికారులతో తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించినందున ఈ రూల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే వారు ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమస్యను కోర్టుకు తీసుకెళ్లేందుకు చట్టం అనుమతిస్తుంది.

హెల్మెట్ ఉన్నప్పటికీ జరిమానా..

హెల్మెట్ ఉన్నప్పటికీ జరిమానా..

మారిన రూల్ప్ ప్రకారం ఎవరైనా వాహనదారుడు తలకు హెల్మెట్ ధరించినప్పటికీ రైడర్ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. దీనికి కారణం ఏటంటే మోటార్ చట్టంలోని రూల్- 194D ప్రకారం.. రైడర్ ధరించిన హెల్మెట్ కు BIS స్టాండర్డ్స్ లేకుంటే రూ.1,000 ఫైన్ విధించబడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోయినా రూ.1,000 చలాన్ విధించబడుతుంది.

చెప్పులు వేసుకున్నా ఫైన్..

చెప్పులు వేసుకున్నా ఫైన్..

మోటారు వాహన చట్టం ప్రకారం.. భారతదేశంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు స్థిరమైన దుస్తులను ధరించాలి. రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనదారులు తమ వాహనంలో ప్రయాణించేటప్పుడు పూర్తిగా మూసి ఉన్న షూలను(Shoes) ధరించడం తప్పనిసరి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్ పోలీసులు రూ.1,000 జరిమానా విధిస్తారు.

ఫైన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి..

ఫైన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి..

మీకు వీటికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎప్పుడైనా ఫైన్ పడిందో లేదో చెక్ చేసుకోవాలంటే https://echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ చలాన్ స్థితిని తనిఖీ చేసుకునే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ప్రస్తుతం కాలం మారింది కాబట్టి మీ చలాన్ నంబర్ లేదా వెహికల్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. కాబట్టి మారిన చట్టాల గురించి తెలుసుకుని వాటిని పాటించటం వల్ల వాహనదారులు భారీ జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.

English summary
motor vehiclers should pay hefty fines even they carry all documents and wearing helmet know why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X