కట్టలు తెంచుకున్న ఆగ్రహం: రాళ్ల వర్షం కురిపించిన వలస కూలీలు

భోపాల్: కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక, తినడానికి తిండి లేక కడుపు మంటతో ఉన్న ఆ కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో తమను సొంత గ్రామాలకు పంపాలంటూ, ఆహారం ఇవ్వాలంటూ రహదారిపై భారీ ఆందోళన చేపట్టారు.

మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బార్వానీ జిల్లాలోని రహదారిపైకి వేలాదిగా వచ్చిన వలస కూలీలు.. ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడేవున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమను సొంత గ్రామాలకు పంపాలంటూ ఆందోళన చేపట్టారు.

 MP-MH Border: Migrants Throw Stones, Protest Over Food and transport

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారే ఈ కూలీల్లో ఎక్కువగా ఉన్నారు.
కాగా, ప్రభుత్వం ప్రకటించిన శ్రామిక్ ట్రైన్లలో వెళ్లేంత ఆర్థిక స్తోమత తమకు లేదని, కాబట్టి తమను బస్సుల్లో ఇంటికి పంపించాలంటూ డిమాండ్ చేశారు.

అంతేగాక, రోడ్డు మీద వెళ్లే వాహనాలపైనా రాళ్లు విసిరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్ వారికి బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వలస కూలీలు ఆందోళన విరమించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+