వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతుళ్ళను ఎద్దులుగా... ఆసరా కోసం ఓ రైతు ఎదురుచూపు

ఎద్దులు కొనుగోలుచేసే ఆర్థికస్థోమత లేక ఓ రైతు తన ఇద్దరు కూతుళ్ళను ఎద్దులుగా మార్చారు. అత్యంత దీనస్థితిలో ఉన్న వారి పరిస్థితి అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

సెహోర్: ఎద్దులు కొనుగోలుచేసే ఆర్థికస్థోమత లేక ఓ రైతు తన ఇద్దరు కూతుళ్ళను ఎద్దులుగా మార్చారు. అత్యంత దీనస్థితిలో ఉన్న వారి పరిస్థితి అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది.

మధ్యప్రదేశ్‌లోని సెహోర్ ప్రాంతానికి చెందిన సర్ధార్ కహ్ల కుటుంబం వ్యవసాయం మీదే ఆధారపడుతోంది. వారికి పూట గడవాలంటే పనిచేసుకోవాల్సిందే.

పొలాన్ని దున్నేందుకు ఆయన దగ్గర ఎద్దులులేవు.వాటిని కొనుగోలు చేసి పోషించే స్థోమత కహ్లకు లేదు. దీంతో తన ఇద్దరు కూతుళ్ళను తన పొలం దున్నేందుకు ఉపయోగించుకొన్నాడు.

MP: No money to buy bull, farmer uses daughters to plough field

ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అందుకే నా కుమార్తెలను కూడ చదువును మద్యలోనే ఆపేయాల్సివచ్చిందని కహ్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పథకాల కింద వారికి సహయం చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు స్పందించారు. అయితే ఎద్దుల స్థానంలో కూతుళ్ళను ఉపయోగించి ఉండాల్సింది కాదన్నారు అధికారులు.

ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సహయం చేయనున్నట్టు ప్రభుత్వోద్యోగి శర్మ హమీ ఇచ్చారు. పంట నష్టపోయి రుణాలు చెల్లించలేక ఆ ప్రాంతంలో ఎంతో మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల మాందసోర్ ప్రాంతంలోరైతులు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఆరుగురు రైతులు చనిపోయారు.

English summary
Financial crisis reduced a farmer in Sehore's Basantpur Pangri village to use his two daughters, instead of oxen to pull the plough in their fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X