దేశంలో తిరుగుబాటు జాడలు కనిపిస్తోన్నాయ్- ఆ గాలి సోకుతోంది: రేణుకా చౌదరి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ.. దేశ రాజధానిలో వాతావరణం మరింత వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాలు తమ నిరసన స్వరాన్ని తీవ్రతరం చేశాయి. అటు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతు భారీగా పెరుగుతోంది. జెన్ జీ యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ కు తరలివస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను బహిరంగంగా ప్రశ్నిస్తోంది. తమ నిరసన గళాన్ని వినిపిస్తోంది.

ఈ పరిణామాలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. క్రమంగా దేశంలో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. అక్కడ ప్రతిధ్వనిస్తున్న నినాదాలు దేశంలో రాబోయే మార్పును సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

MP Renuka Chowdhury Says I Can Hear Vande Mataram and Inquilab Zindabad Revolution Is in the Air

జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్.. వంటి దేశభక్తి, విప్లవాత్మక నినాదాలు మార్మోగుతున్నాయని రేణుకా చౌదరి చెప్పారు. గాల్లో ఓ విప్లవాత్మక మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, దాని తాలూకు వాసన సోకుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి గళమెత్తడం మంచి పరిణామమని, దేశంలో ప్రజాస్వామ్య గుండె చప్పుడు ఇంకా బలంగా కొట్టుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగా పేపర్ లీక్ కావడంతో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని ఆరోపించారు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని, దీనికి బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికీ పార్లమెంట్‌లో ఎలా కొనసాగుతారని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రముఖ సామాజిక, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడం ప్రజాస్వామ్య విలువులకు పూర్తిగా విరుద్ధమని రేణుకా చౌదరి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కు కూడా నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతుకలను బలవంతంగా నొక్కేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

అయోధ్య రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి ఆలయంలో పెద్ద ఎత్తున అవినీతి, లూటీ జరిగిందని, ఇటువంటి తీవ్ర సమస్యలు దేశంలో నెలకొన్నప్పుడు ప్రజాప్రతినిధులు స్పందించకుండా ఎలా ఉంటారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సభలు సజావుగా ఎలా సాగుతాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు, పాపాల వల్లే నేడు దేశప్రజలు తీవ్రమైన కష్టాలు అనుభవించాల్సి వస్తోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+