కేంద్ర మంత్రి మూత్ర మంత్రం: పండ్లు బాగా వస్తాయంట

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాజకీయాల గురించి కాదు. మీ తోటలో పండ్లు బాగా పెద్దగా కాయాలంటే నేను చెప్పినట్లు చెయ్యండని అన్నారు. అయన ఇంత కాలం పాటిస్తున్న రహస్యాన్ని బయట ప్రపంచానికి చెప్పాడు.

అదే యూరిన్ రహస్యం. ఆయన గారు ఇంతకాలం తను పెంచుకుంటున్న చెట్లకు రోజు యూరిన్ పోస్తున్నారట. ఇదే మీరు పాటించండి అంటు సన్నిహితులు, బీజేపీ నాయకులకు సూచించారు. ప్రతి రోజు యూరిన్ డబ్బాలో భద్రపరిస్తే కావాలసినంత యూరియా, నైట్రోజన్ రెడి అవుతుందని, తరువాత మొక్కలుకు పోయాలని అన్నారు.

Mr Gadkari revealed that he once used his own urine on plants in his lawns

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి తోటమాలికి తాను ఈ సలహా ఇచ్చానని, అతను పాటిస్తున్నాడని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం బీజేపీ ఆధ్యర్యంలో కరువుపై పోరాటం అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ ఇంటి ఆవరణంలోని ఆరంజ్ తోటలోని చెట్లకు తాను నిత్యం యూరిన్ పోస్తున్నానని, మొదట వచ్చే కాయలకంటే ఇప్పుడు రెండింతల ఎక్కువగా కాయలు పెద్దగా కాసాయని నితిన్ గడ్కరి అంటున్నారు. చెట్లకు యూరిన్ పోస్తున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టానని మంచి స్పందన వస్తున్నదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+