ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్: నివేదికలో ధోనీ, రైనా పేర్లు?

ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలకు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌తో సంబంధం ఉందని బుకీ ఉత్తమ్ జైన్ అలియాస్ కిట్టీ త్రిచి రైల్వే ఎస్సీ సంపత్ కుమార్ ముందు వెల్లడించినట్లు సమాచారం. ముద్గల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేపట్టింది.
కాగా ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన, ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్ల పేర్లు కూడా ఈ నివేదికలో ఉన్నట్లు ఓ స్పోర్ట్స్ మేగజైన్ పేర్కొంది. అయితే వారి పేర్లు తెలిపేందుకు మాత్రం ఆ మేగజైన్ రిపోర్టర్ నిరాకరించారు. సుప్రీం కోర్టు వద్ద నివేదిక ఉన్నందు వల్ల ఆ వివరాలను వెల్లడించలేమని ఆయన తెలిపారు.
స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న వారిలో బిసిసిఐ మాజీ అధ్యక్షునితోపాటు ఆరుగురు ప్రముఖ ఆటగాళ్ల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బుకీలు చంద్రేష్ జైన్, అశ్వని అగర్వాల్‌తో జరిపిన సంభాషణలను పరిగణలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. పలు అంతర్జాతీయ మ్యాచులకు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు ఆటగాళ్ల పేర్లు కూడా నివేదికలో ఉన్నట్లు రిపోర్టర్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications