Mulayam Singh Yadav Health : ఇంకా విషమంగానే ములాయం ఆరోగ్యం- తాజా బులిటెన్
ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇస్తున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే వైద్యానికి ఆయన శరీరం సహకరించడం లేదని తెలుస్తోంది.
ములాయం ఆరోగ్య పరిస్ధితిపై సమాజ్‌వాదీ పార్టీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులో గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ఐసియులో డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే..ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఇప్పటికీ క్రిటికల్‌గా ఉందని, ఆయనప్రాణాలను రక్షించే మందులపై సమగ్ర నిపుణుల బృందంతో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించింది.

గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్‌ను ఆ తర్వాత ఐసీయూ వార్డుకు తరలించారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, గురుగ్రామ్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి బయటపడ్డారని సమాజ్ వాదీ పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అయితే అంతలోనే ములాయం పరిస్దితిపై మరో ప్రకటన వెలువడింది. ఇందులో ఆయన పరిస్దితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ములాయం యాదవ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హర్యానాలోని ఆసుపత్రిలో ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ సుశీల కటారియా పర్యవేక్షణలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు












Click it and Unblock the Notifications