Tahawwur Rana: ఢిల్లీలో దిగిన ముంబై దాడుల సూత్రధారి తహావుర్ రాణా-ఎన్ఐఏ ఆఫీసుకు..!
2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన తీవ్రవాద దాడుల సూత్రధారి తహావుర్ రాణాను భారత్ విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చింది. దాడుల తర్వాత అమెరికా పారిపోయి 14 ఏళ్లుగా అక్కడే తలదాచుకుంటున్న రాణాను అక్కడి ప్రభుత్వంతో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు భారత్ అదుపులోకి తీసుకుంది. భారత్ కు తనను అప్పగించవద్దంటూ రాణా పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఆయన్ను నిన్న అదుపులోకి తీసుకున్న భారత అధికారులు ఇవాళ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకుని వచ్చారు.
నిన్న తహావుర్ రాణాను తీసుకుని బయలుదేరిన ప్రత్యేక విమానం ఇవాళ ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో దిగింది. దీంతో అధికారులు గట్టి భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలించబోతున్నట్లు తెలుస్తోంది. తహావుర్ రాణా రాక నేపథ్యంలో ఢిల్లీలో భద్రత పెంచారు. ముంబై దాడుల తర్వాత 15 ఏళ్లుగా రాణాను అరెస్టు చేసి కోర్టులో నిలబెట్టేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రాణాను అమెరికా అప్పగించింది.

ఇవాళ అమెరికా నుంచి తహావుర్ రాణాను తీసుకొచ్చిన వారిలో భారత నిఘా, దర్యాప్తు అధికారుల సంయుక్త బృందం ఉంది. వీరు ప్రత్యేక విమానంలో రాణాను అమెరికా నుంచి తీసుకువచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలోని పాలం ఎయిర్ బేస్ లో విమానం దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కాన్వాయ్, సాయుధ కమాండోల్ని మోహరించారు. ఈ కాన్వాయ్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళింది. అక్కడ అధిక భద్రతా విచారణ గదిని సిద్ధం చేశారు. ముంబైలో మూడు రోజుల ముట్టడిలో 166 మంది మరణించిన 26/11 దాడులలో రాణా పాత్రపై విచారణను ఎదుర్కోబోతున్నాడు..
VIDEO | Delhi: Visuals from outside Air Force Station, Palam.
— Press Trust of India (@PTI_News) April 10, 2025
Tahawwur Hussain Rana, a key accused in the 2008 Mumbai terror attacks, is being brought to India from the US on a special flight.#DelhiNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/doPR8pOMy3
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications