సినీ నటి అంజలి శ్రీవాస్తవ ఆత్మహత్య.. ఇంటిలోనే చీరతో ఉరి!

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: భోజ్‌పురి హీరోయిన్ అంజలి శ్రీవాస్తవ (29) ఆత్మహత్య చేసుకుంది. ముంబై పశ్చిమ అంధేరీలోని జుహులేన్‌లో ఉంటున్న అంజలి తన ఇంటిలోనే చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చదవండి: సంచలన కేసు... అంతకంటే సంచలన మలుపు, అవాక్కయిన పోలీసులు

హీరోయిన్ అంజలి ఆత్మహత్య విషయం సోమవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... ఆదివారం రాత్రి అంజలి కుటుంబ సభ్యులు ఆమెకు పలుమార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు.

anjali-srivastava

దీంతో అంజలి ఉంటున్న ఇంటి యజమానికి సమాచారం అందించగా, ఆయన డూప్లికేట్ తాళంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌ ఫ్యాన్ కు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించి అంజలిని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె నివాసంలో ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bhojpuri actress Anjali Srivastava allegedly committed suicide at her apartment in Mumbai’s Juhu suburb, PTI reported on Monday. No suicide note was found at her house, police said. Her family members were worried after Srivastava did not respond to multiple calls on Sunday night. They intimated her landlord who visited her on Monday and opened the apartment using a spare key. He called the police after he found her hanging in the house. Her body was sent to RN Cooper Hospital in suburban Juhu. “A probe is on to find out why she took the extreme step,” Mumbai Police spokesperson DCP Rashmi Karandikar said.
Please Wait while comments are loading...