BMC Election Exit polls: ముంబైకా బాద్ షా ఎవరో తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..!
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పోరేషన్లకు ఇవాళ జరిగిన పోలింగ్ పూర్తయింది. ముంబై, పూణే సహా ఇతర కీలక కార్పోరేషన్లలో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఓటరు నాడి ఎలా ఉందో తెల్చేందుకు రంగంలోకి దిగిన ఎగ్జిట్ పోల్ సంస్థలు సాయంత్రం ఫలితాలను ప్రకటించడం ప్రారంభించాయి. ఇందులో బీజేపీ-థాక్రే బ్రదర్స్ మధ్య సాగిన ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో ఎవరు విజేత కాబోతున్నారనేది ఇందులో దాదాపుగా తేలిపోయింది.
బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) కు ఇవాళ జరిగిన ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఆసియాలోని అత్యంత ధనిక స్ధానిక సంస్ధగా పేరున్న బీఎంసీలో బీజేపీ-సేన కూటమి 130కి పైగా వార్డులను గెలుచుకుంటుందని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇందులో యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ బీజేపీ-శివసేన కూటమికి 131-151 సీట్లు వస్తాయని తేల్చగా..JVC కూటమికి 138 వార్డులు లభిస్తాయని అంచనా వేసింది.

20 ఏళ్ల తర్వాత తిరిగి ఏకమైన ఠాక్రే బ్రదర్స్ ఉద్ధవ్, రాజ్ ఈ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో ధాక్రే బ్రదర్స్ కు 58-68 సీట్లు లభిస్తాయని పేర్కొంది. అలాగే JVC ఎగ్జిట్ పోల్ వీరి కూటమికి 59 వార్డులు వస్తాయని అంచనా వేస్తోంది. అలాగే ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి తో చివరి నిమిషంలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ గరిష్టంగా 12-16 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications