షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం
ముంబై: షోలాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్‌టీ) రైల్వే యార్డులో నిలిపివున్న రైలులోని ఓ బోగీ నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన చేరుకుని మంటలను ఆర్పేశాయి. పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో చేశారు. ప్రమాదం విషయం తెలిసి ప్రయాణికులు, ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై విచారణ చేపట్టామని రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications