అసభ్యంగా చూస్తూ.. వేధింపులు:జడ్జిపై సస్పెన్షన్ వేటు

Mumbai Judge suspended after sexual harassment complaint
ముంబై: అసభ్యంగా చూస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల పైన ముంబైలోని ఒక సెషన్స్ కోర్టు జడ్జి పైన సస్పెన్షన్ వేటు పడింది. ఎంటీ గైక్వాడ్ అనే న్యాయమూర్తి పైన న్యాయస్థానంలో పని చేసే ఉద్యోగి ఫిర్యాదు చేసింది. మరో న్యాయమూర్తితో ప్రాథమిక విచారణ జరిపించారు.

ఆరోపణలు నిజమేనని మిగతా సిబ్బంది ధ్రువీకరించారు. దీంతో జడ్జి పైన చర్యలు తీసుకున్నట్లు బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శాలిని పంసల్కర్ జోషి తెలిపారు.

ఆరోపణల పైన ప్రాథమిక విచారణ జరిపామని ఆమె తెలిపారు. మరో న్యాయమూర్తి ఎస్డీ తులంకర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగిందన్నారు. ప్రాథమిక విచారణలో ఆయన తప్పు తేలినందువల్ల సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి పైన కోర్టులో పని చేసే ఇతర మహిళలు కూడా ఫిర్యాదు చేశారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+