కుప్పకూలిన 4 అంతస్తుల భవనం: 19 మంది మృతి, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కుర్లాస్ నాయక్​ నగర్‌​లో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యల గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం రాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగాయి.

భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిలో కొందరిని వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక దళాలు, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కూలిన భవనానికి పక్కన ఉన్న భవనం కూడా శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అందులోని వారిని ఖాళీ చేయించారు.

Mumbai Kurla Building Collapse: Death Toll Rises To 19, Govt Announces Rs 5 Lakh Ex Gratia

ఘటనాస్థలిని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాక్రే పరిశీలించారు. భవనం ఖాళీ చేయాలని బృహన్​ ముంబయి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చినా అందులోని వారు స్పందించలేదని తెలిపారు. శిథిల భవనాల్లో ఉన్నవారు ఇకనైనా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం ఉద్ధవ్ థాక్రే.

మరోవైపు, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ. 50వేలు ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కుర్లా ఘటనే కాకుండా జూన్ నెలలోనే ఇలాంటి ఘటనలు మూడు చోటు చేసుకున్నాయి. జూన్​ 9న సబర్పన్ బాంద్రాలో మూడు అంతస్తుల భవనం కూలి ఒకరు మృతి చెందగా, 18మంది గాయపడ్డారు. మరోవైపు జూన్ 23న చెంబూర్ ప్రాంతంలో రెండంతస్తుల పారిశ్రామిక నిర్మాణం పైకప్పు కూలి 22 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+