బానిసనయ్యా, నేనింక బతకలేను: 19వఅంతస్థు నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

మహారాష్ట్రలోని బంద్రా శివారు ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి.. ప్రముఖ హోటల్‌లో 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ముంబై: మహారాష్ట్రలోని బంద్రా శివారు ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి.. ప్రముఖ హోటల్‌లో 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన అర్జున్‌ భరద్వాజ్‌ మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అర్జున్‌ సోమవారం బంద్రా శివారులోని ఓ ప్రముఖ హోటల్‌కి వెళ్లి.. 19వ అంతస్థులో గది తీసుకున్నాడు. సాయంత్రం వరకు హోటల్‌ సూట్‌లోనే ఉన్న అర్జున్‌.. సోమవారం రాత్రి తన గది కిటికీ నుంచి దూకి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Mumbai: Man uploads video on suicide tutorial before jumping to death from Bandra hotel

ఒక్కసారిగా అరుపు విన్న హోటల్‌ సిబ్బంది వెళ్లి చూసేసరికి అర్జున్‌ రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే వారు అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, చనిపోవడానికి ముందు అర్జున్‌ సోషల్‌మీడియాలో ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అనే ఓ వీడియో పోస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.హోటల్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ను కూడా గుర్తించినట్లు చెప్పారు.

'నేను మాదకద్రవ్యాలకు బానిసయ్యాను. ఇక నాకు బతకాలని లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా' అని అర్జున్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. హోటల్‌లో ఇచ్చిన వివరాల ఆధారంగా అర్జున్‌ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అర్జున్ చాలా మంచివాడని, కానీ, గత కొద్ది రోజులుగా ఒత్తిడిలో ఉన్నాడని అతని స్నేహితులు చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+