ఎవరికి ఓటేసినా కాంగ్రెస్‌కే: వాస్తు కోసం ఈవిఎం మార్పు

Muniyappa has his way, gets EVM’s direction changed
పుణె/బెంగళూరు: మహారాష్ట్రలోని పుణెలోని శ్యామ్‌రావు కల్మాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లోని ఈవిఎంలో ఓటర్లు ఏ పార్టీకి ఓటువేసినా కాంగ్రెస్ పార్టీకే బదిలీ అవుతుండటంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటర్లు తమ ఓటును ఏ పార్టీకి వేసినా అది కాంగ్రెస్ పార్టీకే వేసినట్లు చూపుతుండటంతో ఓటర్లు ఈ విషయాన్ని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.

ఈవిఎంలో ఏ మీట నొక్కినా కాంగ్రెస్ పార్టీ గుర్తు(చేయి) ఉన్న లైటే వెలుగుతోందని ఓటర్లు వెల్లడించారు. దీంతో ఈవిఎంను పరిశీలించిన అధికారులు, యంత్రంలో లోపం కారణంగానే ఈ విధంగా జరిగిందని తెలిపారు. తక్షణమే ఆ ఈవిఎంలో ఓటింగ్ నిలిపేసి, మరో ఈవిఎంలో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. అప్పటికే ఓటు వేసిన 28 మందికి మళ్లీ ఓటు వేసేందుకు అనుమతించారు.

వాస్తు కోసం ఈవిఎం మార్చిన కేంద్రమంత్రి

బెంగళూరు: కర్ణాటకలోని హారోహళ్లి పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి, కోలారు లోకసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కెహెచ్ మునియప్ప ఏకంగా ఈవిఎంనే పక్కకు మార్చేశారు. గురువారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన వాస్తు ప్రకారం లేదనే ఉద్దేశంతో ఈవిఎంను పక్కకు మార్పించేశారు.

పోలింగ్ కేంద్రంలో ఈవిఎం దక్షిణ వైపు ఉంది. వాస్తు ప్రకారం అది తూర్పు దిక్కున ఉండాలని ఆయన అధికారులను కోరారు. అధికారులు ఈవిఎంను తూర్పు దిక్కుకు మార్చిన తర్వాతే మంత్రి ఓటు వేశారు. దీంతో మంత్రి తీరుపై ఆయా పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో.. ఈవిఎంను మళ్లీ దక్షిణ దిక్కుకే మార్చడం గమనార్హం. అయితే ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో అధికారిగా ఉన్న మంజులను బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+